కొట్టాల్ గ్రామంలో రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొని వ్యక్తి మృతి

లింగంపేట, వెలుగు: రెండు బైక్ లు ఢీకొని ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన ఎల్లారెడ్డి మండలం కొట్టాల్ గ్రామ సమీపంలో గురువారం జరిగింది. ఎస్సై మహేశ్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపేట మండలంఎక్కపల్లికి చెందిన బాలమొల్ల సురేశ్ (28) బైక్పై ఎలారెడ్డికి వెళ్తున్నాడు.

లింగంపేట మండలం భవా నీపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్పై వస్తున్నారు. ప్రమాదవశాత్తు వారి రెండు బైక్లు ఢీకొన్నాయి. దీంతో సురేశ్ అక్కడి కక్కడే చనిపోయాడు. మృతుడిక చిన్నాన్న బాలమొల్ల పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు -నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.