- నిజామాబాద్ సిటీలో ఘటన
నిజామాబాద్ క్రైమ్, వెలుగు : వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన నిజామాబాద్ సిటీలో జరిగింది. వన్ టౌన్ పోలీసులు తెలిపిన ప్రకారం.. సిటీలోని మిర్చి కాంపౌండ్ లో మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన యూసుఫ్(45) తో పాటు మరో ఇద్దరు ఓ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసు ఎదుట శనివారం రాత్రి నిద్రపోయారు.
వీరిలో యూసుఫ్ తెల్లారే సరికి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు అతడిని గొంతు కోసి హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. షాపు ఓనర్ నజీర్ అహ్మద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.