Health Alert : మన ధరించే కట్ డ్రాయర్ ప్రతిరోజూ మార్చాలా..

సాధారణంగా ప్రతి ఒక్కరు ఇన్నర్ డ్రస్​ వాడతారు.  కొంతమంది బద్దకంలో మూడు నాలుగు రోజులు వాష్​ చేయకుండా దానినే బాడీకి తగిలించేస్తారు.  అలా వేసుకున్నారా ఇక అంతే మీ బాడీలోకి బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది.. ఇదేంటి.. అండర్​ వేర్స్​ కు బ్యాక్టీరియాకు సంబంధం ఏమిటి అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియోపై ఓ లుక్కేయండి...

చలికాలం వచ్చేసింది... చాలా మంది బద్దకిస్తారు.  స్నానం చేయకుండా  రెండు .. మూడు రోజులు గడుపుతారు.  ఇక బట్టల విషయానికొస్తే త్వరగా ఆరవని రెండు మూడు రోజులు అవే బట్టలు వేసుకుంటారు.  కనీసం లోదుస్తులు కూడా మార్చరు.  పైబట్టలు మార్చకపోతే పెద్దగా ప్రమాదం ఏమీ ఉండదు కాని..... కాని లో దుస్తులను వాష్ చేయకపోతే చాలా ప్రమాదం ఉంటుంది.  

mixrovisionx ఇన్​స్ట్రాగ్రాంలో పోస్ట్​ చేసిన  ఓ వీడియో లో  రెండు మూడు రోజులు ధరించిన లోదుస్తులను మైక్రోస్కోప్ లో పరిశీలించారు. ఆ బట్టలపై చాలా కీటకాలు కనిపించాయి.  అవి అటూ ఇటూ కదులుతున్నాయి.  ఈ వీడియో చూసిన జనాలు ఉలిక్కి పడ్డారు.  ఆ కీటకాల వలన గజ్జి... తామర వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.  ఒక్కోసారి ఇవి అంటువ్యాధులుగా కూడా మారవచ్చు.  అందుకే లోదుస్తులను స్పేర్​ ఉంచుకోవాలి.  ఒకసారి వాడిన తరువాత తిరిగి వాడేటప్పుడు కచ్చితంగా వాష్​ చేయాలి.  లేదంటూ కచ్చితంగా అందులో బ్యాక్టీరియా నివాసముంటుంది.   అవకాశం ఉంటే హాట్​ వాటర్​లో వాష్​ చేస్తే మరీ మంచిది.   సో..  నెటిజన్స్​ బీ కేర్​ ఫుల్​ ఫర్​ యువర్​ ఇన్నర్స్..