సిగ్గుచేటు ఘటన..! గుడిలోపల అశ్లీల చిత్రాలు చూస్తూ..

ఘజియాబాద్‌లోని ఓ ఆలయంలో సిగ్గుచేటు ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ కెమెరాకు చిక్కాడు. సదరు వ్యక్తి ఆలయం లోపల తన మొబైల్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ హస్తప్రయోగం చేసుకున్నాడు. ఒక చేత్తో ఫోన్ పట్టుకుని మరో చేత్తో అసభ్యకర పని చేస్తూ కనిపించాడు. ఆ దృశ్యాలను మరొక వ్యక్తి తన మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అతని కామ క్రీడ వీడియో సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది.

వీడియోలో అతని పక్కన మరో వ్యక్తి నిద్రిస్తున్నట్లు కనిపించినప్పటికీ, అతను దానిని పట్టించుకోకుండా అసభ్యకర చర్యకు పాల్పడ్డాడు. ఆలయ ద్వారం లేదా కిటికీలోంచి ఓ వ్యక్తి వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

అశ్లీలానికి బానిస

నిందితుడిని పట్టుకొని విచారించిన పోలీసులు, అతను అశ్లీలానికి బానిసైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. పోర్న్ వ్యసనం బారిన పడినట్లు తేల్చారు. అతని మొబైల్ హిస్టరీ మొత్తం అశ్లీలంతో నిండిపోయినట్లు గుర్తించారు. అతనికి ఇప్పటికే, కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.