యాదాద్రి, వెలుగు : తన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయని ఓ వ్యక్తి కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయగా.. మిగిలిన డబ్బులను సైతం సైబర్ నేరగాళ్లు దోచేశారు. యాదాద్రి జిల్లా భువనగిరి రూరల్ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... వడపర్తికి చెందిన ఓ వ్యక్తి తన ఫ్రెండ్‌కు ఫోన్ పే ద్వారా రూ.24 వేలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఆ డబ్బులు తన ఫ్రెండ్ అకౌంట్‌లో డిపాజిట్ కాకపోవడంతో గూగుల్‌లో సెర్చ్ చేసి అందులో కనిపించిన ఓ కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేశాడు.
ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి తాను చెప్పినట్లు చేస్తే డబ్బులు రిటర్న్ వస్తాయని నమ్మించాడు. దీంతో అతడు చెప్పినట్లు ఫోన్ ఆపరేట్ చేయడంతో బాధితుడి అకౌంట్‌లో ఉన్న రూ. 50 వేలు డ్రా అయ్యాయి. దీంతో మోసపోయినట్లు గ్రహించిన సదరు వ్యక్తి వెంటనే భువనగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.