వేములవాడ రాజన్న ఆలయం బయట అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

వేములవాడ రాజన్న అలయ బయట అవరణలో 2024 జులై 1వ తేదీన సోమవారం మధ్యాహ్నం ఓ గుర్తు తెలియని వ్యక్తి (45) అనుమానప్పదంగా మృతిచెందాడు.  మృతుడు కూల్ డ్రింక్ లో పురుగుల మందు తాగి అత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు.  సంఘటన స్థాలానికి చేరకున్న  వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ వీరా ప్రసాద్ పరిశీలించారు. అయితే మృతుడికి సంబంధించిన ఎలాంటి వివరాలు తెలియలేదని, అతని వద్ద సెల్ ఫోన్ ఉన్నప్పటికి అందులో ఎలాంటి డేటా లేదని, సిరిసిల్ల నుండి వేములవాడకు వచ్చిన బస్ టికెట్ మాత్రం లభ్యమైనట్లు తెలిపారు.  ఆచూకీ తెలిసిన వారు వేములవాడ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన 87126 56413 నెంబర్ కు సమాచారం అందించాలని సీఐ వీర ప్రసాద్ తెలిపారు.