రాయే కదా అని 17 ఏండ్లు దాచుకున్నాడు.. కోట్ల విలువైనదని తెలిసి ఏం చేశాడంటే...

కొందరికి కాయిన్స్, గిఫ్ట్స్,  వస్తువులు, కొంచెం వెరైటీగా ఉన్న వస్తువులను దాచుకోవడం అలవాటు ఉంటుంది. అలాంటి అలవాటు ప్రకారం ఒక వ్యక్తి ఒక రాయిని 17 ఏళ్లు దాచుకున్నాడు. ఆ తర్వత అది కోట్ల విలువైనదని తెలసి షాకయ్యాడు. ఇన్నాళ్లు తెలియక దాచుకున్న.. దాని విలువ తెలిసుంటే బిలియనీర్ అయ్యేవాణ్ని కదా అని నిట్టూర్చాడు. 

ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ హోల్ అనే వ్యక్తికి రత్నాలు (జెమ్స్), విలువైన ఖనిజాలు, రాళ్లు దాచుకోవడం అలవాటు. అయితే 2015లో ఒక ఎరుపు జేగురు రంగులో రాయి దొరికింది. చూడటానికి రంగులో ఉండి బరువుగా ఉండే సరికి ఇదేదో తేడాగా ఉందని దాన్ని పగల గొట్టాలని చూశాడు. సుత్తి, శానం తదితర వస్తువులతో పగలగొట్టాలని చూశాడు. ఎంత ప్రయత్నం చేసినా పగలక పోయే సరికి నానా రకాలుగా ప్రయత్నించి వదిలేశాడు. చిన్న చిన్న రంద్రాలు చేసి చూద్దామని ప్రయత్నించినా కొంత వరకే కానీ పెద్దగా రంద్రాలు పడలేదు. 

దీన్ని పగలగొట్టడం మన వల్ల కాదులే అనుకొని.. విచిత్రంగా ఉంది కదా పడి ఉంటుందిలే అని ఓ మూలన పడేశాడంట. 17 ఏండ్ల తర్వాత ఇంత బరువు, ఇంత గట్టిగా ఉంది కదా.. ఇదేమైనా బంగారం లాంటి విలువైన వస్తువు అయ్యుంటుందని మెల్బోర్న్ మ్యూజియం వాళ్లకు చూపించడాడట. 

మ్యూజియం ఎక్స్పర్ట్స్ దానికి కొన్ని టెస్టులు చేసి అది ఉట్టి రాయి కాదు.. కోట్ల విలువైన వస్తువు అని నిర్ధారించారు. అది ఉల్క (ఆస్టరాయిడ్) అని, 4 - 6 బిలియన్ సంవత్సరాలకు చెందిన ఉల్క అని నిర్ధారించారు. చూడటానికి చిన్నగా ఉన్నా 17 కేజీల బరువు కలిగి ఉన్న ఆ ఉల్కలో ఐరన్, మినరల్స్, ఇతర కెమికల్ కంపౌండ్స్ తో ఏర్పడి చాలా బలంగా, బరువుగా ఉందని తెలిపారు. 

అయితే ఈ ఉల్క భూమిపైన 100 - 1000 ఏండ్ల మధ్య పడి ఉంటుందని శాస్త్రవేత్తలు ప్రయోగాల అనంతరం తెలిపారు. మార్స్, జూపిటర్ గ్రహాల మధ్యలో ఉండే ఈ ఉల్క.. సూర్యుని చుట్టూ తిరుగుతున్న క్రమంలో..  భూమికి దగ్గరగా వచ్చిన సందర్భంలో భూమిపై పడి ఉంటుందని తెలిపారు. దీనికి మరిబొరౌ ఉల్కగా పేరు పెట్టిన పరిశోధకులు.. ఇది బంగారం కంటే విలువైనదని, మిలియన్ డాలర్ల కంటే ఎక్కవ విలువైనదని చెప్పారు. 

ఈ ఉల్క వలన బిలియన్ సంవత్సరాలకు పూర్వం విశ్వం ఎలా ఉండేదని, సౌర వ్యవస్థలో ఇప్పుడు వచ్చిన మార్పులు ఏంటనే విషయాలను తెలుసుకోవచ్చునని చెబుతున్నారు. మరిబొరౌ ఉల్కను ఇన్నాళ్లుగా దాచి తెచ్చి ఇచ్చిన డేవిడ్ హోల్ కు మంచి రివార్డ్ ఇచ్చారట మ్యూజియం అధికారులు. 

డేవిడ్ హోల్ ప్రపంచమంతా మెచ్చుకుంటుందట. ఎందుకంటే రాయే కదా అని పారవేసి ఉంటే ఈరోజు కోట్ల సంవత్సరాల క్రితం విశ్వ పరిస్థితులను పరిశోధించే అవకాశం వచ్చేది కాదు. ఇన్ని ఏండ్లుగా దాచుకొని భవిష్యత్తు పరిశోధనలకు చాలా మేలు చేశాడని అవార్డులు, రివార్డులతో డేవిడ్ ని సత్కరించారు .