మద్యం మత్తులో ఇల్లు కాలుతున్నా చూసుకోలేదు.. చివరికి ఇంట్లోనే..

జగిత్యాల జిల్లా, వెలుగు : జగిత్యాల జిల్లా మల్యాల మండలం మ్యాడంపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గాతం తిరుపతి (40) అనే వ్యక్తి షార్ట్ సర్క్యూట్ తో తన ఇంట్లో  మృతి చెందాడు.  షార్ట్ సర్క్యూట్ కారణంగా శిథిలావస్తలో ఉన్న ఇంటికి మంటలు అంటుకోవడంతో పై కప్పు కూలిపోయింది. సడెన్ గా మంటలు అంటుకోవడంతో ఇంట్లో ఉన్న తిరుపతి మంటల్లో చిక్కుకొని కాలిపోయినట్లు తెలుస్తుంది. 

తిరుపతి గత కొంత కాలంగా ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు.  రాత్రి మద్యం సేవించి పడుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మద్యం మత్తులో ప్రమాదాన్ని గమనించలేక మంటల్లో చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.