మధిరలో టీడీపీ 42వ ఆవిర్భావ వేడుకలు

మధిర, వెలుగు: మధిరలోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్​లో శుక్రవారం టౌన్​ప్రెసిడెంట్​ మల్లాది హనుమంతరావు ఆధ్వర్యంలో టీడీపీ 42వ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం ముఖ్య​అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా రామనాథం మాట్లాడుతూ.. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో పూర్వ వైభవం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. అనంతరం మధిర మండలంలో టీడీపీ సీనియర్ నాయకులను ఘనంగా సత్కరించారు.లీడర్లు చేకూరి శేఖర్ బాబు, మార్నిడి పుల్లారావు, సునీల్, ,జగన్ మోహన్ రావు పాల్గొన్నారు.

భద్రాచలం: తెలుగు జాతిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత ఎన్టీఆర్​కే దక్కుతుందని  టీడీపీ మహబూబాబాద్​ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అజీం, ఉపాధ్యక్షుడు కొడాలి శ్రీనివాస్​పేర్కొన్నారు. భద్రాచాలంలో శుక్రవారం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ప్రజలను పట్టిపీడిస్తున్న పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కుంచాల రాజారాం, పీఏసీఎస్​ చైర్మన్​ అబ్బినేని శ్రీనివాసరావు, కంభంపాటి సురేశ్​కుమార్​ పాల్గొన్నారు.