హత్యచార కేసులో మలయాళ నటుడు ముకేశ్ అరెస్ట్

  • ముందస్తు బెయిల్ తీస్కోవడంతో వెంటనే రిలీజ్ చేసిన పోలీసులు
  • మరో సినీ ప్రముఖుడు సిద్దిక్​పై లుక్​అవుట్ నోటీసులు జారీ

కొచ్చి:  మలయాళ సినీ ఇండస్ట్రీని కుదిపేసిన మీటూ కేసులో సీపీఎం ఎమ్మెల్యే, సినీ నటుడు ఎం.ముకేశ్​ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ముకేశ్ గతంలో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఒక నటి చేసిన ఫిర్యాదుతో ఇటీవల ఆయనపై కేసు పెట్టిన పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అయితే ముకేశ్ కోర్టు నుంచి ముందుగానే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడంతో ఆయన్ను మెడికల్ టెస్టుల తర్వాత వెంటనే రిలీజ్ చేశారు. జస్టిస్ హేమ కమిటీ రిపోర్టుతో మలయాళ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించాయి. 

ఈ నేపథ్యంలో గతంలో అత్యాచారాలు, లైంగిక వేధింపులకు గురైన పలువురు నటీమణులు ముందుకు వచ్చి వారు అనుభవించిన వేదనను చెప్తున్నారు. తమను వేధించిన వారిపై కేసులు పెడుతున్నారు. దీంతో కేరళ ప్రభుత్వం ఈ ఫిర్యాదులపై ఎంక్వైరీ కోసం ఏడుగురు సభ్యులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ఏర్పాటు చేసింది. మంగళవారం ముకేశ్​ను విచారించిన సిట్ ఆయన్ను అరెస్టు చేసింది. మరో నటి పెట్టిన రేప్ కేసులో మరో సినీ ప్రముఖుడు సిద్దిక్‌‌‌‌‌‌‌‌  అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. ఆయన ముందస్తు బెయిల్ కోసం కేరళ హైకోర్టులో పిటిషన్ వేయగా.. హైకోర్టు తిరస్కరించింది. దీంతో సిద్దిక్‌‌‌‌‌‌‌‌ కోసం వెతుకుతున్న పోలీసులు లుక్‌‌‌‌‌‌‌‌అవుట్‌‌‌‌‌‌‌‌ నోటీసులు జారీ చేశారు.