మాల మహానాడు మహా సభకు హాజరుకండి

ఎల్లారెడ్డిపేట, వెలుగు: రాష్ట్రంలో దళితుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామిని కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు రొడ్డ రామచంద్రం విజ్ఞప్తి చేశారు. బుధవారం జగిత్యాల జిల్లా ధర్మారం మండలం తిమ్మాపురం గ్రామంలో ఎమ్మెల్యే వివేక్‌‌‌‌‌‌‌‌ను కలిసి  దళితుల సమస్యలను వివరించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున మాలమహానాడు ఆధ్వర్యంలో ఈ నెలలో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరుకావాలని కోరారు. ఆయనతోపాటు మాలమహానాడు ప్రతినిధులు రాగుల రాములు, కొరివి వేణుగోపాల్, ఎడ్ల రాజ్ కుమార్, రాజారాం, మంగ కిరణ్, చంద్రం, రమేశ్‌‌‌‌‌‌‌‌, లింబయ్య ఉన్నారు.