బోనమెత్తిన ఎమ్మెల్యే

రామడుగు, వెలుగు: రామడుగు మండలం కొక్కెరకుంటలో మాల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ తల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు. పండుగకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎంపీపీ జవ్వాజి హరీశ్ హాజరై బోనాలను ఎత్తుకున్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని పోచమ్మ తల్లిని వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు కోల రమేశ్​, మాజీ ఎంపీటీసీలు ఉట్కూరి రాములు, కుంబల రాజేశం పాల్గొన్నారు.