పెద్దపల్లికి రైల్వే కేటాయింపులు చేయండి

  •     కాంట్రిబ్యూషన్‌‌‌‌‌‌‌‌కు తగ్గట్లు ఫండ్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వండి
  •     లోక్‌‌‌‌‌‌‌‌సభలో కేంద్రానికి ఎంపీ వంశీకృష్ణ విజ్ఞప్తి
  •     సింగరేణి కాలరీస్‌‌‌‌‌‌‌‌ నుంచి రైల్వేకు భారీ ఆదాయం వస్తుందని వెల్లడి
  •     పెద్దపల్లి నియోజకవర్గంలోని పలు స్టేషన్లలో ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌ ట్రైన్లు ఆపాలని వినతి

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణలోని పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఇస్తున్న రెవెన్యూ కాంట్రిబ్యూషన్‌‌‌‌‌‌‌‌కు తగ్గట్లు తిరిగి కేటాయింపులు జరపాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. గురువారం లోక్‌‌‌‌‌‌‌‌సభలో రైల్వే గ్రాంట్స్ 2024–25పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా రైల్వే రెవెన్యూ రూ.2.78 లక్షలు కోట్లు ఉంటే, అందులో 40–50 శాతం రెవెన్యూ కేవలం బొగ్గుపైనే వస్తుందని చెప్పారు. ఆ బొగ్గు సరఫరాలో తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న పెద్దపల్లి నియోజకవర్గం నుంచి వస్తుందని తెలిపారు. 

సింగరేణి కాలరీస్ నుంచి 70 మిలియన్ టన్నుల బొగ్గు దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతోందన్నారు. దీని ద్వారా రైల్వేకు రూ.11 వేల కోట్లు రైల్వేకు రెవెన్యూ సమకూరుతుందని వివరించారు. అందువల్ల తమ వాటాకు తగ్గట్లుగా పెద్దపల్లిలో రైల్వే అభివృద్ధికి సహకరించాలని కేంద్రాన్ని కోరారు. తన తాత గడ్డం వెంకటస్వామి(కాకా), తన తండ్రి వివేక్‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి సేవలందించారని గుర్తుచేశారు. తన తాత కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారన్నారు. అదే దారిలో తాను కూడా పెద్దపల్లి ప్రజల ఆశీర్వాదంతో తొలిసారిగాఎంపీగా గెలిచి లోక్‌‌‌‌‌‌‌‌సభలో అడుగుపెట్టానన్నారు.

చెన్నూరు- రామగుండం మధ్య  రైల్వే కనెక్టివిటీని విస్తరించండి..

చెన్నూరు– రామగుండం మధ్య రైల్వే కనెక్టివిటీని విస్తరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వంశీకృష్ణ కోరారు. అలాగే, బెల్లంపల్లి– సికింద్రాబాద్ మధ్య రైల్వే లైన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తిరుపతికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం తిరుపతి ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌ను ఓదేలు, పెద్దపల్లి, రామగుండం స్టేషన్లలో ఆపాలని కోరారు. సికింద్రాబాద్– నాగ్‌‌‌‌‌‌‌‌పూర్ వందే భారత్ ట్రైన్‌‌‌‌‌‌‌‌ను మంచిర్యాలలో ఆపాలని రిక్వెస్ట్ చేశారు. తెలంగాణ– ఢిల్లీ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్ రైలుకు పెద్దపల్లితో పాటు ఓదేలులో హాల్టింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాజీపేట్– బల్లార్ష ప్యాసింజర్, శబరిమల ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్ రైళ్లను మంచిర్యాల, చెన్నూరులో ఆపాలని విజ్ఞప్తి చేశారు. 

సింగరేణి, రామగిరి ప్యాసింజర్ ట్రైన్లను మందమర్రిలో నిలుపుదల చేయాలన్నారు. కాగా, తాజా కేంద్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో దాదాపు రూ.20 వేల కోట్లు రైల్వే భద్రతకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని వంశీకృష్ణ అన్నారు. అయితే తమ ప్రాంతంలో ఎలాంటి రైల్వే ప్రమాదాలు జరగలేదని, దీంతో డిఫ్రిసేషన్ రిజర్వ్ ఫండ్, రైల్వే సేఫ్టీ ఫండ్, రాష్ట్రీయ రేల్ సంరక్ష కోచ్ ఫండ్‌‌‌‌‌‌‌‌తో పెద్దపల్లిలో రైల్వే అభివృద్ధికి కేటాయింపులు చేయాలని కోరారు. కాగా, దేశంలో వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు తనను కూడా బాధిస్తున్నాయని చెప్పారు. 

ప్రకృతి విపత్తును రాజకీయం చేయొద్దు: ఎంపీ వంశీకృష్ణ

కేరళలో జరిగిన ప్రకృతి విపత్తును రాజకీయం చేయొద్దని వంశీకృష్ణ అన్నారు. వయనాడు దుర్ఘటనకు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఎంపీ రాహుల్ గాంధీయే కారణం అన్నట్లు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడటం దారుణమని, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు. గురువారం పార్లమెంట్ ఆవరణలో వంశీ మీడియాతో మాట్లాడారు. గడిచిన పదేండ్ల బీజేపీ పాలనలో ఎన్నో రైలు ప్రమాదాలు జరిగి వందల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. 

ఆ ప్రమాదాలకు బీజేపీ బాధ్యత వహిస్తుందా? అని ప్రశ్నించారు. ప్రయాణికుల భద్రత కోసం ఏటా రైల్వే శాఖ దాదాపు రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, ఆ డబ్బులన్నీ ఎటు పోతున్నాయో సమాధానం చెప్పాలని నిలదీశారు. రైలు ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.