పార్లమెంట్​ ఎన్నికలపై పార్టీల ఫోకస్​

  • నల్గొండ, భువనగిరి ఎంపీ స్థానాల పైన ఆసక్తికర చర్చ
  • రెడ్లకు ధీటుగా బీసీ, ఎస్టీలకు ఎంపీ టికెట్ల​ ప్రతిపాదన
  • బీఆర్​ఎస్​, బీజేపీలో సామాజిక సమీకరణాల పైనే నజర్​
  •  కాంగ్రెస్పాత సంప్రదాయాన్నే కొనసాగించే ఛాన్స్​ ! 

నల్గొండ, వెలుగు : ఉమ్మడి జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలు పార్లమెంట్​ ఎన్నికలపై  దృష్టి పెట్టాయి.  జిల్లాలోని 11  అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన  కాంగ్రెస్​..  ఎంపీ ఎన్నికల్లో సైతం తమకు తిరుగుండదనే ధీమా వ్యక్తం చేస్తోంది.  2014, 2019 ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్​ నల్గొండ, భువనగిరి ఎంపీ స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గానికే అవకాశం ఇచ్చిం ది. బీఆర్ఎస్​ మాత్రం నల్గొండలో రెడ్డి, భువనగిరిలో బీసీ క్యాండిడేట్లను ని ల బెట్టింది.

ఇక బీజేపీ, టీడీపీ పొత్తులో భాగంగా 2014లో నల్గొండ, భువ నగిరిలో రెడ్డి వర్గానికే ప్రాధాన్యం  ఇచ్చింది. మళ్లీ 2019లో నల్గొండలో ఆర్యవైశ్యులకు, భువనగిరిలో వెలమ సామాజిక వర్గానికి కేటాయించారు.  ఈ నేపథ్యంలో వచ్చే ఎంపీ ఎన్నికల్లో ఏ వర్గానికి ఎంపీ టికెట్​ ఇస్తే పార్టీకి ప్రయోజనం కలుగుతుందనే దాని పైనే బీఆర్​ఎస్​, బీజేపీలో చర్చ నడు స్తోంది. కాంగ్రెస్​ ఎప్పటిలాగే రెడ్డి వర్గాన్నే బరిలో దింపాలని యోచిస్తోంది.

ఈ మేరకు రెండు చోట్ల పార్టీ హైకమాండ్​కు పంపిన ఆశావహుల జాబితా లో రెడ్డి వర్గానికి చెందిన పేర్లు  ఉన్నట్టు తెలుస్తోంది.  2 009 పార్లమెంట్​ ఎన్నికలప్పటి నుంచి కాంగ్రెస్ 'రెడ్డి' ఫార్మూలనే అమలు చేస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా ఆ వర్గానికి చెందిన క్యాండిడేట్లకే టికెట్​ ఖాయమని సీనియర్లు చెబుతున్నారు.  కానీ బీఆర్ఎస్​, బీజేపీ లో మాత్రం సామాజిక సమీకరణాల పై చర్చ జరుగుతోంది. 

బీఆర్​ఎస్​లో భిన్నవాదనలు..

బీఆర్ఎస్​లో ఎంపీ క్యాండిడేట్ల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. ఆర్ధికంగా, సామాజికంగా బలమైన క్యాండిడేట్లను బరిలో దిం పాలని భావిస్తున్నారు. భువనగిరి నుంచి మండలి చైర్మన్​ సుఖేందర్​ రెడ్డి కొడుకు అమిత్​ రెడ్డి పోటీ చేస్తారని చెప్తున్నారు. తండ్రిబాటలోనే ఎంపీ గా తన రాజకీయ అరంగ్రేటాన్ని భువనగిరి నుంచే మొదలు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిసింది.

ఇటీవల పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ తో జరిగిన ప్రత్యేక భేటీలో కూడా సుఖేందర్​ రెడ్డి భువనగిరి స్థానాన్నే కోరి నట్టు సమాచారం. అయితే మాజీ మంత్రి జగదీశ్​ రెడ్డి మాత్రం ఏదో ఒకస్థా నాన్ని బీసీలకు లేదంటే ఎస్టీలకు ఇవ్వాలని ప్రతిపాదించినట్టు తెలిసింది. నల్గొండ ఎంపీ సెగ్మెంట్​ పరిధిలో ఎస్టీ ఓటర్లు ఎక్కువ ఉండటంతోనే మాజీ మంత్రి ఎస్టీల ప్రతిపాదన తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది. ఒకవేళ బీసీలకు ఇవ్వాల్సి వచ్చినా ఆర్ధికంగా బలమైన క్యాండేట్లనే ఎంపిక చేస్తారనే అంటున్నారు.  ఇంకోవైపు ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేల్లో ఆర్ధికంగా బలమైన లీడర్ల పేర్లను కూడా పార్టీ హైకమాండ్​ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. 

బీజేపీలో సీనియర్లు పోటీ...

బీజేపీలో ఎంపీ టికెట్​ కోసం సీనియర్లకు, నయా లీడర్లకు మధ్య పోటీ న డుస్తోంది. పార్టీలో ఐదేళ్ల సీనియార్టీ కూడా లేని  కొత్త లీడర్లు   ఎంపీ టికెట్​ కోసం పోటీ పడుతుంటంతో సీనియర్లు ఆందోళన చెందుతు న్నారు. ఇన్నాళ్లు పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి, ఎమ్మెల్యే స్థానాన్ని సైతం త్యాగం చేసిన సీనియర్లకే ఎంపీ టికెట్​ ఇవ్వాలని హైకమాండ్​ పై ఒత్తిడి చేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ వాదాన్ని భుజాన వేసుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో కూడా రెండు సీట్లు ఆ వర్గానికే ఇవ్వాలని ఆశావహు లు కోరుతున్నారు. ఇప్పటికైతే నల్గొండ ఎంపీ స్థానం కోసం ప్రముఖ న్యా యవాధి నూకల నర్సింహారెడ్డి, జిల్లా అధ్యక్షుడు డాక్టర్​ నాగం వర్షిత్​ రెడ్డి, గార్లపాటి జితేంద్ర కుమార్​, వెదిరె శ్రీ రాంరెడ్డి, మన్నెం రంజిత్​ యాదవ్​ పే ర్లు ప్రచారంలో ఉన్నాయి.

నల్గొండలో ఫార్వర్డ్ బ్లాక్​ తరపున పోటీ చేసిన పిల్లి రామరాజు యాదవ్​ కూడా ఎంపీ టికెట్​ కోసం స్టేట్​ ప్రెసిడెట్​ కిషన్​ రె డ్డిని కలిశారు. భువనగిరి రేసులో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగడి మనోహర్​ రె డ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్​, జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్​ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. వీళ్లతో పాటు ఆలేరు, ఇబ్రహీంపట్నంలో గౌడ వర్గానికి చెందిన మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.