Rishabh Pant: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. కోహ్లిని వెనక్కినెట్టిన రిషభ్‌ పంత్‌

రోడ్డు ప్రమాదంలో గాయపడి ఎడదన్నర పాటు ఆటకు దూరమైన రిషభ్‌ పంత్‌ పునరాగమనంలో అదరగొడుతున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 20 పరుగులకే విఫలమైనప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 99 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. ఈ ప్రదర్శనతో పంత్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీని అధిగమించాడు. మూడు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకున్నాడు.

అగ్రస్థానంలో రూట్

 ఈ జాబితాలో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్(917 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. యశస్వి జైస్వాల్(780 పాయింట్లు) నాలుగో స్థానంలో, విరాట్ కోహ్లీ(720 పాయింట్లు) ఒక స్థానం దిగజారి ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెండు స్థానాలు దిగజారి శ్రీలంక బ్యాటర్ కరుణరత్నెతో కలిసి 15వ స్థానంలో సమంగా ఉన్నారు.

ALSO READ | Pakistan Cricket: తిట్టిన బాధపడకు.. నిన్ను కాదనుకో: బాబర్‌కు మహ్మద్ అమీర్ మద్దతు

బుమ్రా.. నెం.1

ఇక టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత పేసర్ జస్ప్రిత్ బుమ్రా అగ్రస్థానంలో ఉండగా.. రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

బ్యాటర్ల ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ 

  • 1. జో రూట్ (ఇంగ్లండ్): 917 పాయింట్లు
  • 2. కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్): 821 పాయింట్లు
  • 3. హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్): 803 పాయింట్లు
  • 4. యశస్వి జైస్వాల్ (భారత్): 780 పాయింట్లు
  • 5. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా): 757 పాయింట్లు
  • 6. రిషబ్ పంత్ (భారత్): 745 పాయింట్లు
  • 8. విరాట్ కోహ్లీ (భారత్): 720 పాయింట్లు