హిందూ మతంలో చాలా మంది దేవుళ్లు ఉన్నారు. మామూలుగానే ఒక్కో దేవుడికి ఒక్కోరకం భక్తులు ఉంటారు. భక్తులంటే పూజలు, పునస్కారాలు, ఉపవాసాలు, జాగారాలు చేస్తుంటారు. కానీ శివ భక్తులు మాత్రం అలా వీళ్లు కాస్త ప్రత్యేకం. శివుడ్ని దేవుడిగానే కాక, ఒక ఐకాన్ భావిస్తారు. అందుకే శివుడికి యూత్ ఫాలోయింగ్ ఎక్కువ. శివుడు ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థం అవుతున్నాడు. మనం ఇప్పటిదాకా పురాణాల్లో విన్న శివుడికి, ఈ శివుడికీ చాలా తేడా ఉంది.. ఈయన మోడ్రన్ శివుడు.
సింపుల్ శివ
శివుడ్ని ఇష్టపడడానికి అతని సింప్లిసిటీయే కారణం, శివుడ్ని ఎంతో శక్తివంతుడిగా కొందరు తెలియని అమాయకుడిలా మరికొందరు చూస్తున్నారు. అందుకే ఆయన్ను భోజ శంకరుడు అని కూడా అంటారు. భోకా అంటే లౌక్యం తెలియని సాదాసీదా మనిషని అర్థం. వజ్రాలు, దండలు. కిరీటాలు ధరించకుండా దిగంబరంగా ఉంటాడు. ఎటువంటి ఆరాటాలు చేతిలో త్రిశూలం, మెడలో పాము ధరించి తన పాటికి తను శ్మాశానాల్లో, హిమాలయాల్లో గడుపుతాడు.
శివుడు మనిషిలా పుట్టి తపస్సుతో దేవుడు అయ్యాడు. అందరి దేవుళ్లకి ఉండే సూపర్ పవర్సే కాకుండా మనుషులకు ఉండే మాములు ఎమోషన్స్ కుడా శివుడికి ఉంటాయి. అతనికి అందరిలాగే కోపం వస్తుంది. కోపంలో చేసిన పనులకి తర్వాత పశ్చాత్తాప పడతాడు. అందరిలాగే భార్యని అమితంగా ప్రేమిస్తాడు. అందరిని ఇట్టే నమ్మేస్తాడు. మనుషుల నుంచి రాక్షసుల దాకా ఎవరు ఏదీ అడిగినా.. కాదనకుండా ఇచ్చేస్తాడు. ఇంత సింపుల్గా మనం నిత్యం చూసే మనిషిలానే ఉంటే ఎవరైనా
ఎందుకు ఇష్టపడరు?
అంతే కాదు, శివుడికి భక్తి విషయంలో కూడా భేదభావాలుండవు. పురాణాల్లో రాక్షసుల దగ్గరనుంచి దేవుళ్ల దాకా అందరూ శివ భక్తులే. అంతెందుకు, ఇప్పుడు కాశీలో కనిపించే అఘోరాలే దానికి ఉదాహరణ. వాళ్లు సాధారణ మనుషులు చేసే పనులకు భిన్నంగా చేస్తారు. ఎందుకని అడిగితే... "మంచి, చెడు రెండూ శివుడే. శివ తత్వానికి ఏదీ అతీతం కాదు. అంతటా శివుడు వ్యాపించి ఉంటాడు' అని చెప్తారు.
లవింగ్ శివ
ఒకప్పుడు 'ఎలాంటి భర్త కావాలి?' అని ఏ అమ్మాయిని అడిగినా రాముడి లాంటి భర్త కావాలని చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడు ఎవరిని అడిగినా 'శివుడు కావాలి' అంటున్నారు. ఈతరం అమ్మాయిలు. "శివుడిలో అమితంగా ఇష్టపడేది ఆయన ప్రేమనే. ఇప్పటి వరకు ఎవ్వరికీ లేని పేరు ఒక్క శివుడికే ఉంది, అర్ధనారీశ్వరుడని. 3 ఏకంగా తన శరీరంలో సగభాగాన్ని భార్యకు ఇచ్చేశాడు. ఏ పురాణాల్లో అయినా ఇంతకన్నా గొప్పగా ప్రేమించే పురుషుడు మరొకడు " ఉండదు" అంటున్నారు అమ్మాయిలు. శరీరంలోనే కాదు జీవితంలో కూడా సగభాగం భార్యకు సమర్పించే గ్రేట్ లవర్ శివుడు అన్నది వాళ్ల అభిప్రాయం.
యాంగ్రీ శివ
శివుడి కోపమే ఆయనకి యూత్లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. శివుడు మూడో కన్ను తెరిస్తే సృష్టి అంతా నాశనం అనే మాటలు వినే ఉంటారు. కానీ ఇప్పటి జనరేషన్ వాళ్లు ఈ మూడో కన్నుకి కొత్త అర్థాలు చెప్తున్నారు. మూడో కన్ను అంటే అవగాహనా దృష్టి అని చెప్తున్నారు. ప్రపంచంలో మనం చూసేదంతా నిజం కాదు కదా, పైపెచ్చు ఆ కళ్లు మెదడుకు అన్ని రకాల చెత్తను చేరవేస్తాయి. అందుకే మరొక కన్ను, అంటే 'థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ' అన్న మాట. కేవలం మనం చూసింది. విన్నది. నమ్మేయకుండా ఇంకో కోణంలో ఆలోచించాలని ఆ మూడోకన్ను అర్ధం అని కొంతమంది చెప్తున్నారు.
పీసపుల్ శివ
ఇంకో వైపు రౌద్రానికి భిన్నంగా శివుడ్ని శాంతి కోణంలో చూసేవాళ్లు మరికొంత మంది. సాధారణంగా ధ్యానం అంటే బుద్ధుడే గుర్తిస్తాడు.. కానీ శివుడు బుద్దుడి కంటే ముందే గొప్ప ధ్యాని అని, ఆది యోగి అని అంటున్నారు ఈ జనరేషన్ మోడ్రన్ శివ భక్తులు. శివుడు ధ్యానం చేసే ప్రతిమను ఎదురుగా పెట్టుకొని ధ్యానం చేసేవాళ్లు కూడా ఉన్నారు.
డ్యాన్సింగ్ శివ
శివుడి రూపాల్లో చాలా మందికి బాగా నచ్చేది నటరాజ రూపం. శివుడి డ్యాన్స్ కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా కోపంతో శివుడు చేసే శివతాండవం చాలా మందికి స్ఫూర్తి. ఒకప్పుడు క్లాసికల్ డ్యాన్సర్లు నటరాజ విగ్రహం ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేసేవాళ్లు. ఇప్పుడు చాలా మంది యంగ్ డ్యాన్సర్ల మొబైల్స్ కూడా నటరాజు వాల్ పేపరే కనిపిస్తోంది.