జాతీయ రాజకీయాల్లో మహారాష్ట్ర ఎన్నికల ప్రభావం

మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలలో ఊహించని ఫలితాలు వచ్చాయి. జార్ఖండ్‌లో  ప్రజలు మరోసారి వినూత్న తీర్పునిచ్చారు. జార్ఖండ్​ ముక్తి మోర్చా (జేఎంఎం) ముఖ్యమంత్రి  హేమంత్ సోరెన్  పాలన పేలవగా ఉందని,  ఆ రాష్ట్ర  ప్రజల్లో అధికార ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నందున బీజేపీ  విజయం ఖాయమని ప్రచారం జరిగింది.  బీజేపీ కూడా గెలుపు కోసం శాయశక్తులా ఎన్నో ప్రయత్నాలు చేసినా  ఓటమి మాత్రం తప్పలేదు. ఇది పెద్ద ఆశ్చర్యం కలిగించింది. అయితే, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై పెద్దగా  ప్రభావం చూపవు. 

 మహారాష్ట్రలో  పైకి  ఎన్డీఏ,  ఇండియా కూటమి.. ఈ రెండు కూటములు ప్రధానంగా  కనపడుతున్నా అక్కడ  మూడు గ్రూపుల  ప్రధాన  ప్రత్యర్థులు ఉన్నారు.  బీజేపీ  వర్సెస్ కాంగ్రెస్,  అజిత్ పవార్  వర్సెస్​ శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే  వర్సస్​ ముఖ్యమంత్రి ఏక్​నాథ్​ షిండే వర్గాలు హోరాహోరీగా తలపడ్డాయి.  బీజేపీ  మహారాష్ట్ర ఎన్నికల్లో పరాజయం పాలైతే  అప్పుడు  ప్రతిపక్ష ఇండియా కూటమికి మోదీ సర్కారును  బలంగా ఢీకొట్టగలిగే  గొప్ప శక్తి లభించేది.  గత నెలలో హర్యానాలో  బీజేపీ  అనూహ్యంగా  గెలిచిన తర్వాత కూడా  మహారాష్ట్రలో  తామే గెలుస్తామని  ప్రతిపక్షాలు ధీమాగా  చెబుతూనే ఉన్నాయి.  కానీ,  అలా జరగలేదు.    

చంపయీ​ సోరెన్​ ప్రభావం కనిపించలేదు

 జార్ఖండ్​లో  మెజారిటీ సాధించలేకపోయిన వెలితి బీజేపీని ఇబ్బంది పెడుతున్నది. హేమంత్​ సోరెన్​ పాలనపై పెరిగిన వ్యతిరేకత తమను గెలిపిస్తుందనే బీజేపీ అంచనా నిజం కాలేకపోయింది.   జైలుకు వెళ్లివచ్చిన సీఎం హేమంత్ సోరెన్​కు ట్రైబల్స్​లో సానుభూతి పెరిగిందా, అలాగే ‘మాయీ యోజన’ పథకం కూడా కలిసొచ్చి  ఇండియా కూటమి జార్ఖండ్​లో  గెలుపు సాధించగలిగిందనే మాట కూడా వినిపిస్తున్నది. మాజీ ముఖ్యమంత్రి చంపయీ సోరెన్​  కూడా  బీజేపీని  గెలిపించలేకపోయారు. 

మోదీ ఓవర్ కాన్ఫిడెంట్ అవుతారా?

4 జూన్  2024 నుంచి మోదీ దూకుడును తగ్గించి నెమ్మదిగా, జాగ్రత్తగా ముందుకు వెళుతున్నారు. తొలి పదేండ్లు ప్రధానిగా  మోదీ ఒంటిచేత్తో  పాలన సాగించారు. ఇప్పుడు మహారాష్ట్రలో భారీ విజయం,  మరోవైపు  కాంగ్రెస్,  ప్రతిపక్షాలు ప్రధాన ఎన్నికల్లో  ఘోరంగా ఓడిపోవడంతో  మోదీ, బీజేపీ పాతరోజులకు తిరిగి వచ్చినట్లు భావించే ప్రమాదం ఉంది. అలా అనుకోవడం చాలా తప్పు.  హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో  జరిగిన ఎన్నికల్లో ఆసక్తికర అంశం ఏమిటంటే.. ఐదేండ్ల క్రితం మోదీ  చేసినంత  ప్రచారం ఈసారి చేయలేదు. స్థానిక నాయకులు,  పొత్తుల వల్లే  గెలుపోటములు ఖరారయ్యాయనేది వాస్తవం. ఒక్కోసారి  భవిష్యత్  రాజకీయాలను మనం ఖచ్చితంగా ఊహించలేం.  

ప్రస్తుతం  మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే సారథ్యంలో శివసేన,  అజిత్ పవార్  నేతృత్వంలో ఎన్సీపీ,  బీజేపీ  స్పష్టమైన విజయాలు సాధించాయి. వీరి ధాటికి ఇతర పార్టీల మనుగడ సందేహాస్పదంగా మారింది. అయితే, కాంగ్రెస్​ జాతీయ పార్టీ కాబట్టి  ఆ పార్టీ మనుగడకు పెను ప్రమాదం లేదు. కానీ, కాంగ్రెస్​కు మహారాష్ట్ర ఫలితంతో  గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాగా, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికలను మనం మరచిపోకూడదు. అక్కడ 9 అసెంబ్లీ స్థానాల్లో ఉపఎన్నికలు జరగ్గా బీజేపీ 7 స్థానాల్లో గెలిచింది.  జూన్‌లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కోల్పోయిన ప్రతిష్టను  బీజేపీ తిరిగి పొందింది. 

 – పెంటపాటి పుల్లారావు,పొలిటికల్​ ఎనలిస్ట్​–