మహా శివరాత్రి స్పెషల్ : ఓంకార నాదం.. మంత్రం కాదు ఆరోగ్య రహస్యం

చాలామంది ప్రశాంతత కోసం నిశ్శబ్దాన్ని కోరుకుంటారు. ఆనందం కోసం శబ్ద రూపంలో సంగీతాన్ని ఆస్వాదిస్తుంటారు. పంచభూతాల్లో శబ్దం ఎప్పట్నుంచో ఉందని పండితులు చెబుతారు. ఆ శబ్దం ఆకాశం నుంచి వస్తుంది. శబ్దానికి ఆధారం ఓంకారం. నిజానికి ఓంకారం ప్రతి దేహంలో ఉంటుంది. ‘ఓం' అని శబ్దం చేయగానే, ఆ తరంగాలతో దేహం పులకితమవుతుంది.

'ఓం' అన్నది మంత్రం కాదు.. మత సంబంధమైనది అసలే కాదు.. వేదాల్లో నిక్షిప్తమైన ఓంకార నాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం. ప్రాచీన కాలంలో రుషులు వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఉపవాస దీక్షల్లో కూడా ఆరోగ్యవంతంగా ఉండటం వెనుక ఓంకార నాదమే రహస్యం. ఓంకారం ఉచ్చరించడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. 

* నాభిలోంచి లయబద్ధంగా ఓంకార పదాన్ని పలకగలిగితే మానవుడి ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది.
* ఓంకారం పదిహేను నిమిషాల పాటు ఉచ్ఛరించగలిగితే రక్తపోటు తగ్గుతుంది.
* రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె బాగా పనిచేస్తుంది.
* మానసిక అలసట, అలజడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది. 
* ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.
* జీర్ణక్రియ సవ్యంగా సాగుతుంది. 
* కిడ్నీ వ్యవస్థ మంచిగా పనిచేస్తుంది. 
* థైరాయిడ్ పనితీరును క్రమబద్ధం చేస్తుంది. ఓంకారంలో ఉన్న మహత్యం ఇదే.