నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదో రోజు.. విజయాలను చేకూర్చే 'మహా నవమి'

నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదవ రోజుకి మహా నవమి అని పేరు. నవరాత్రులు ముగిసే ముందు, విజయ దశమి నాడు ఈ ఆరాధనకు చివరి రోజు. నవరాత్రి 9 రోజులలో, దుర్గామాత తొమ్మిది రూపాలతో దర్శనమిస్తుంది. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంధరఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయనీ, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రిని పవిత్ర గ్రంథాలలో తెలిపిన దైవిక నియమాల ప్రకారం దేవతామూర్తులను పూజించాలి.

ఈ సంవత్సరం, నవమి అక్టోబర్ 23న వచ్చింది. దృక్ పంచాంగం ప్రకారం, నవమి తిథి అక్టోబర్ 22న రాత్రి 7:58 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 23, 2023న సాయంత్రం 5:44 గంటలకు ముగుస్తుంది. ఈ సందర్భంగా ప్రియమైన వారికి, సన్నిహితులకు తెలియజేయాల్సిన మహా నవమి శుభాకాంక్షలు, కోట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Also Read : తిరుమల శ్రీవారి సేవలో ఏపీ గవర్నర్‌ దంపతులు

మహా నవమి 2023 శుభాకాంక్షలు, కోట్‌లు

  •     మీరు పీల్చే గాలి నవ్వు, ప్రేమతో నిండి ఉండాలి. ఈ మహా నవమి మీకు సంతోషాన్ని, శ్రేయస్సును అందించాలి. అందరికీ దుర్గా నవమి శుభాకాంక్షలు!
  •     జీవితంలో హెచ్చు తగ్గులు ఉంటాయి, కొన్ని రోజులు అత్యంత కష్టంగా ఉంటాయి. ఈ సమయంలో దుర్గ మాత మీకు బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. మహా నవమి శుభాకాంక్షలు!
  •     జీవితంలో మీకు శక్తిని, బలాన్ని ఇవ్వడానికి దుర్గా దేవి ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు అన్ని సవాళ్లను అధిగమించాలని ఆశిస్తున్నాము. మీకు మహానవమి శుభాకాంక్షలు.
  •     దుర్గా.. విశ్వ మాత, శక్తి స్వరూపిణి. దుర్గా నవమి ఈ పవిత్ర సందర్భంలో ఆశీర్వాదం కోసం ఆమెకు నమస్కరించి.. పవిత్రమైన మహా నవమిని జరుపుకోండి.
  •    ఈ పవిత్రమైన మహా నవమి రోజున, మీకు, మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజు, రాబోయే అన్ని సమయాలలో ఆనందం, అభివృద్ధి, ప్రయత్నాలు విజయం చేకూరాలని ఆశిస్తున్నాం.