ఇదేం చెత్త వెరైటీ:మజ్జిగతో మ్యాగీ ఏంట్రా..మీ బొంద..తిట్టిపోస్తున్న నెటిజన్లు

మ్యాగీ.. 2 నిమిషాల్లో రెడీ అని యాడ్స్ లో చూస్తాం కానీ..ఐదు, 10 నిమిషాలు అయితే పడుతుంది..మ్యాగీ అనగానే నీళ్లు పోసి ఆ తర్వాత నూడుల్స్ వేసి..ఆ తర్వాత మసాలా వేస్తారు..అదే నీళ్లు కాకుండా మజ్జిగ పోసి మ్యాగీ చేస్తే..ఏంటీ అవాక్కయ్యారా..షాక్ అయ్యారు..ఈ వెరైటీని చేసి చూపించాడు సూరత్ కు చెందిన అంకిత్ అనే స్ట్రీట్ వెండర్..మరి మజ్జిగతో మ్యాగీపై రియాక్షన్ ఎలా ఉందో చూద్దామా..

గుజరాత్ రాష్ట్రం సూరత్ కు చెందిన చటోరా అంకిత్..వీధిలో మ్యాగీ, ఫ్రైడ్ రైస్ అమ్ముతూ జీవనం సాగిస్తాడు. వ్యాపారం పెంచుకునేందుకు..తనకు వచ్చిన మజ్జిగ తో మ్యాగీ ఐడియాను అమలు చేశాడు. చాస్ మ్యాగీ ఆఫ్ సూరత్ పేరుతో..మజ్జిగతో మ్యాగీ అమ్మకాన్ని ప్రారంభించి..వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 

ఈ వీడియోపై చాలా ఎక్కువ మంది నెటిజన్లు అసహనం వ్యక్తంచేశారు. మ్యాగీకి ఉండే రుచిని చంపేయొద్దు.. మ్యాగీని కొన్నాళ్లు బతకనీయండి అంటూ కామెంట్ చేశారు. మరికొందురు అయితే మజ్జిగ మ్యాగీని తిన్నోళ్లు బతికే ఉన్నారా అంటూ కామెంట్ చేశారు. దీన్ని ఎలా తింటున్నారు అని ఎక్కువ మంది అసహనంగా వ్యక్తం చేయటం విశేషం.  మజ్జిగ, మ్యాగీ విడివిడిగా ఎంతో మంచివి.. ఈ రెండింటినీ కలిపి ఒకేసారి చంపేస్తున్నారు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు..

ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా.. మజ్జిగ మ్యాగీ మాత్రం సోషల్ మీడియాలో మస్త్ పరేషాన్ చేస్తుంది. మనం అయితే సూరత్ వెళ్లి ఎలా ఉందో తినలేం కదా.. అందుకే ఇంట్లోని ఓ సారి ట్రై చేయండి అంటున్నారు మరికొంత మంది నెటిజన్లు. ఏది ఏమైనా మజ్జిగ మ్యాగీ సమ్మర్ లో హీట్ పుట్టిస్తుంది.