రూ.13.11 లక్షలకు మద్నూర్ తైబజార్ వేలం

మద్నూర్, వెలుగు: మద్నూర్ తైబజార్​కు స్పెషల్​ఆఫీసర్​బండివార్ విజయ్ అధ్యక్షతన గురువారం వేలంపాట నిర్వహించారు. మద్నూర్​కు చెందిన అమర్, హన్మండ్లు రూ.13.11 లక్షలు పలికి దక్కించుకున్నారు. గతేడాది రూ.10.20 లక్షలు పలకగా, ఈ ఏడాది రూ.2.90 లక్షలు అదనంగా వచ్చాయి.