కేజీబీవీ ఆరో తరగతి విద్యార్థిని హత్మహత్యాయత్నం

సూర్యాపేట జిల్లా : మద్దిరాల మండలం కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. స్కూల్ రెండో అంతస్తుపై నుంచి దూకి ఆరో తరగతి విద్యార్థిని సూసైడ్ చేసుకోబోయింది. తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

పాఠశాల సిబ్బంది వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసుకుందని తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు. తీవ్రగాయాలైన విద్యార్థిని జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం ఇది జరగగా కేజీబీవీ పాఠశాల సిబ్బంది సాయంత్రం వరకు బయటకు తెలియకుండా గోప్యంగా ఉంచారు.