ఆత్మకూర్(ఎస్ )కు బస్సు సౌకర్యం కల్పించాలి : ఎం.శ్రీజ

సూర్యాపేట, వెలుగు : ఆత్మకూర్ (ఎస్  )గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమైక్య జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీజ అధికారులను కోరారు. ఈ మేరకు విద్యార్థినులతో సహా శ్రీజ మంగళవారం కలెక్టర్ వెంకట్​రావు, డిపో మేనేజర్ శ్రీనివాసులును కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆత్మకూర్​(ఎస్) గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో ఇంటర్, డిగ్రీ విద్యార్థులు చదువుకు దూరమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. డిపో మేనేజర్ తో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పిస్తామని కలెక్టర్ చెప్పినట్లు తెలిపారు. వినతిపత్రం ఇచ్చినవారిలో సమైక్య జిల్లా ఉపాధ్యక్షులు కుసుమశ్రీ , కోశాధికారి మనీషా, భవాని, మాధవి, అభిశ్రీ, శ్రావణి, మహేశ్వరి, అఖిల, సమీనా, లావణ్య, ఎంవీ ఫౌండేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు.