మళ్లీ తెరుచుకున్న ఎల్‌ఎండీ గేట్లు

కరీంనగర్, వెలుగు :  లోయర్‌ మానేరు డ్యామ్‌కు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో వస్తుండడంతో ఆఫీసర్లు గేట్లను ఓపెన్‌ చేసి నీటిని విడుదల చేస్తున్నారు. మిడ్‌ మానేరు నుంచి 10,200 క్యూసెక్కుల వరద ఎంఎల్‌డీకి చేరుతోంది.

దీంతో ఆదివారం రెండు గేట్లను ఎత్తి 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎల్‌ఎండీ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా ప్రస్తుతం 23.947  టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాకతీయ కెనాల్‌కు మరో ఐదు వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.