ఎల్ఎండీ గేట్లు ఓపెన్..

కరీంనగర్, వెలుగు: మిడ్ మానేరు నుంచి ఇన్ ఫ్లో పెరగడంతో ఇంజినీర్లు శనివారం సాయంత్రం లోయర్ మానేరు డ్యామ్  ప్రాజెక్ట్ వరద గేట్లను ఎత్తి కిందికి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 24.034 టీఎంసీలు కాగా మిడ్ మానేరు నుంచి 13 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండడంతో శనివారం తెల్లవారుజాము వరకు 23.600 టీఎంసీలకు నీటిమట్టం చేరింది. సాయంత్రం వరకు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరడంతో 4 గంటలకు ప్రాజెక్ట్ స్పిల్ వేకు సంబంధించి 2 గేట్లు ఎత్తి 5,200 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. అలాగే కాకతీయ కెనాల్ కు మరో 4000 క్యూసెక్కుల  నీటిని వదిలారు.