లో క్యాలరీ క్రిస్మస్ బిస్కెట్స్

క్రిస్మస్ పండుగ సందర్భంగా చాలామంది ఇంట్లోనే రకరకాల కేక్స్, బిస్కట్స్ తయారు చేసుకుంటుంటారు. అయితే అందరూ వాటిని పర్ఫెక్ట్ గా చేయలేరు. ఎవరో కొంతమందే బాగా చేయగలరు. దానికీ కారణాలున్నాయి. అవేంటో తెలుసుకుని, సరిచేసుకుంటే ఈ సారి క్రిస్మస్ కు బిస్కట్స్ పర్ఫెక్ట్ గా, హెల్దీగా చేసుకుని తినేయొచ్చు. అందుకోసమే ఈ టిప్స్... బిస్కట్స్ చేయాలనుకున్నప్పుడు మొదటగా కావాల్సిన పదార్థాలు రెడీ చేసిపెట్టుకోవాలి. అయితే అందులో క్యాలరీలను పెంచే పదార్థాలకు బదులు హెల్దీగా ఉండే పదార్థాలు తీసుకుంటే బేకింగ్ కూడా ఈజీ అవుతుంది.

 పదార్థాలు మార్చేయాలి 

చక్కెరకు బదులు ఎరిత్రిటాల్, లో ఫ్యాట్ కోసం వెన్న తీసుకోవాలి. అయితే వాటిని కూడా కావా ల్సినంత క్వాంటిటీనే తీసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మామూలుగా ఎంత పిండి తీసుకుంటే, దానిలో సగానికి చక్కెర తీసుకుంటారు. దాని బదులు ప్రొటీన్ పౌడర్ వాడితే మంచిదని వెయిట్ లాస్ కోచ్ సజెస్ట్ చేస్తున్నారు. ఇలా చేస్తే బిస్కట్స్ లో న్యూట్రిషనల్ వాల్యూస్ పెరుగుతాయి. అయితే కొంతమందికి పిండి లేకపోతే నచ్చదు. అలాంటి వాళ్లు 30 శాతం వరకు పిండి బదులు ప్రొటీన్ పౌడర్ తీసుకుంటే బెటర్. హెల్త్ కి హెల్త్, టేస్ట్ కి టేస్ట్!

 ఏ పిండి బెటరంటే.. 

బిస్కట్స్ ను  మైదా లేదా గోధుమ పిండితో తయారుచేస్తుంటారు. కానీ, వాటికి బదులు పొట్టు తియ్యని గోధుమల పిండి (హోల్ మీల్ ఫ్లోర్) వాడితే చాలా బెటర్ అంటోంది జర్మన్ యూనివర్సిటీ ఆఫ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తోన్న యమీలా బెట్జ్. ఎందుకంటే అందులో ఫైబర్, మినరల్స్ ఎక్కువ. ఇంకొంచెం ఎక్కువ పోషకాలు కావాలనుకుంటే ఇందులో ఉలవలు, శనగ పిండి లేదా ఏవైనా పప్పు ధాన్యాల పిండిని కలపొచ్చు. వాటిలో కూడా ప్రొటీన్ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా గోధుమ పిండి బదులు బాదం పొడి లేదా కొబ్బరి పొడిని వాడొచ్చని ఎక్స్ పర్ట్స్ చెప్తున్నారు. 

తక్కువ క్యాలరీలు 

ఈ ఫెస్టివ్ సీజన్ లో ఎక్కువగా కోకోనట్ మ్యాకరూన్స్ తినడానికి ఇష్టపడతారు. అవి హెల్కి చాలా మంచివి. ఎందుకంటే... వాటి తయారీలో పిండి లేదా పొడి వాడరు. కోడిగుడ్డు తెల్ల సొన, చక్కెర కూడా తక్కువే వాడతారు. బేక్ చేశాక వాటిలో ఉండే స్వీట్నెస్ సరిపోతుంది. ఇవి తియ్యగా ఉంటాయి కదా. ఎక్కువ క్యాలరీలు ఉంటాయోమో అనే అనుమానమే వద్దు. కాబట్టి కోకోనట్ మ్యాకరూన్స్ ఇష్టపడేవాళ్లు క్యాలరీల గురించి ఆలోచించకుండా హ్యాపీగా తినొచ్చు.