ఉద్యమకారుడికి ఘన వీడ్కోలు

నకిరేకల్, వెలుగు : తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నకిరేకల్ పట్టణానికి చెందిన యానాల లింగారెడ్డి ఆదివారం పాముకాటుకు గురై మృతి చెందాడు. లింగారెడ్డి అంతిమయాత్ర నకిరేకల్ పట్టణంలోని మార్కెట్ రోడ్డు నుంచి వారి వ్యవసాయ క్షేత్రం వరకు కొనసాగింది. ఈ అంతిమయాత్రలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని పాడె మోసి భావోద్వేగానికి గురయ్యారు.