నార్కట్‌పల్లి, వెలుగు: నల్గొండ జిల్లాలోని 65వ నంబర్‌జాతీయ రహదారిపై చిట్యాల వద్ద లారీ దగ్ధమైంది. స్థానికుల వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున విజయవాడ నుంచి హైదరాబాద్‌కు సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ చిట్యాల వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో లారీ డీజిల్ ట్యాంక్ పగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ ప్రాణాలతో బయటపడగా, లారీ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం కారణంగా హైవేపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలు ఆర్పిన అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.