నల్గొండలో ఘోర ప్రమాదం: డివైడర్ ను ఢీకొట్టిన లారీ... డీజిల్ ట్యాంక్ పేలి పూర్తిగా దగ్ధం

నల్గొండ జిల్లాలోని చిట్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవే 65పై ఓ లారీ డివైడర్ ను ఢీకొట్టింది. శుక్రవారం ( అక్టోబర్ 11, 2024 ) ఉదయం చోటు చేసుకుంది ఈ ఘటన. లారీ వేగంగా వచ్చి డివైడర్ ను ఢీకొట్టడంతో డీజిల్ ట్యాంక్ పేలి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో లారీ పూర్తిగా దగ్దమైంది.

అయితే.. డ్రైవర్ మంటలను ముందుగానే గమనించి బయటకు దూకటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. తృటిలో ప్రమాదం తప్పడంతో డ్రైవర్ ఊపిరి పీల్చుకున్నాడు.