యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆదివారం పెనుప్రమాదం తప్పింది. డీజిల్ కోసం భువనగిరిలోని ఓ పెట్రోల్ బంక్ కు వచ్చిన లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. లారీ డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు అంటుకున్నాయి.
దీంతో పెట్రోల్ బంక్ సిబ్బంది సహా అక్కడే ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. అప్రమత్తమైన లారీ డ్రైవర్.. వెంటనే లారీ ఇంజిన్ ఆఫ్ చేసి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో స్థానికులు, బంక్సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.