శివ భగవానుడి ఐదు రూపాలు ఇవే.... ఎవరు ఏ రూపం పూజించాలో తెలుసా..

శివుడు లయకారుడు.. నెత్తిమీదే గంగ ఉన్నా.. చెంబుడు నీళ్లు పోస్తే చాలు.. అనుగ్రహిస్తాడు.  ఎన్ని వృక్షాలున్నా... ఒక్క మారేడు దళంతో పూజిస్తే చాలు పరవశించిపోతాడు.. విబూధి అద్దితే చాలు.. కోరిక కోర్కెలు తీరుస్తాడు.  అలాంటి శివయ్య    దేవుళ్లంతా ఒళ్లంతా ఆభరణాలతో వెలిగిపోతుంటారు..కానీ శివుడు బూడిద పూసుకుని ప్రధానంగా ఐదు రూపాల్లో దర్శనమిస్తాడు.  ఏ రూపంలో ఉన్న శివ భగవానుడిని ఎవరు పూజించాలి... ఎందుకు పూజించాలో తెలుసుకుందాం. . . .

దేవుళ్లంతా నిత్య అలంకరణలో కనిపిస్తారు కానీ శివుడు ఎందుకు కనిపించడు అనుకుంటున్నారేమో..శివుడు అభిషేక ప్రియుడు మాత్రమే కాదు అలంకార ప్రియుడు కూడా. శంకరుడు కూడా సర్వాలంకార భూషితుడే. అయితే  ఒక్కో రూపంలో ఒక్కోలా కనిపిస్తాడు. ఆ రూపాలే  తత్పురుషం, అఘోరం, సద్యోజాతం, వామదేవం, ఈశానం... అనే ఐదు రూపాల్లో శివ భగవానుడిని పూజిస్తుంటారు. 

ALSO READ :- ఆ శివాలయానికి వెళితే.. పక్కా పెళ్లి.. ఆ గుడి  ఎక్కడుందంటే...

తత్పురుషం :  తేజోవంతుడిగా, ధ్యానంలో కూర్చుని, ప్రశాంతంగా కనిపిస్తూ..తూర్పుముఖంగా కూర్చుని ఉండే శివుడి రూపాన్ని తత్పురుషం అంటారు. ఇలా కనిపించే శివుడు కేవలం దేవతలకు మాత్రమే దర్శనమిస్తాడు. ఈ రూపానికి పూజలందించేది కూడా దేవతలే.

తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి ....తన్నో రుద్రః ప్రచోదయాత్ 

సద్యోజాతం:  శివుడంటే లింగరూపమే. నిత్యం ఆలయాల్లో పూజలు జరిగేది శివలింగానికే. అభిషేక ప్రియమైన ఈ రూపాన్ని సద్యోజాతం అంటారు. లింగ రూపంలో ఉన్న పరమేశ్వరుడిని యోగులు, సిద్ధులు ఎక్కువగా పూజిస్తారు. 

సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః 
భవే భవే నాతిభవే భవస్వ మామ్ భవోద్భవాయ నమః 

వామదేవం:  పరమేశ్వరుడు కూడా అలంకార ప్రియుడే అని చాటిచెప్పే రూపమే వామదేవం. శివుడు కుటుంబంతో సహా కనిపించే రూపంలో సర్వాలంకార భూషితుడిగా ఉంటాడు. మిగిలిన రూపాల్లో కనిపించని విధంగా శివుడు అలంకారాలతో, పక్కన అమ్మవారు, వినాయకుడు, కుమారస్వామి, నందితో కన్నులపండువగా కనిపిస్తాడు. సుఖ, సంతోషాలు, భోగభాగ్యాలు, సత్సంతానంతో తులతూగాలని మానవాళిని ఆశీర్వదించే రూపం ఇది. ఆలయాల్లో మినహా ఇంట్లో ఎక్కువగా పూజించేది ఈ రూపాన్నే.

వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ-
శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః
కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో
బలప్రమథనాయ నమ-స్సర్వ-భూతదమనాయ 
నమో మనోన్మనాయ నమః 

 
అఘోరం :  దిగంబంరంగా, నల్లని కాటుకతో, శరీరం అంతా బూడిదతో...అత్యంత భయంకరంగా ఉండే రూపాన్ని అఘోరం అని పిలుస్తారు. కపాలాలనే కుండలాలుగా ధరించి, త్రినేత్రం తెరిచి శవాలవైపు  చూస్తూ కనిపిస్తాడు శివుడు. ఈ రూపాన్ని దర్శించుకునేది, పూజించేది కేవలం అఘోరాలే. భూతప్రేతాలను అదుపులో ఉంచి మనల్ని కాపాడే అఘోర రూపం భయంకంపితంగా ఉంటుంది. 

అఘోరేభ్యోஉథ ఘోరే”భ్యో ఘోరఘోరతరేభ్యః 
సర్వేభ్య-స్సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరోపేభ్యః 
త్ర్యంబకం యజామహే సుగంథిం పుష్టి వర్ధనం 
ఉర్వారుకమివ బంధనాన్-మృత్యోర్-ముక్షీయ మాஉమృతాత్
 

ఈశానం : మరో ముఖంగా చెప్పే ఈశానంలో పరమేశ్వరుడు అత్యంత ప్రియభక్తులను మాత్రమే అనుగ్రహిస్తాడట.

వ్యక్తావ్యక్త గుణేతరం సువిమలం - శట్త్రింశతత్వాత్మకం
తస్మాదుత్తర తత్త్వమక్షరమితి - ధ్యేయం సదా యోగిభిః
వందే తామస వర్జితం త్రినయనం - సూక్ష్మాతి సూక్ష్మాత్పరం
శాంతం పంచమమీశ్వరస్య వదనం - ఖవ్యాపి తేజోమయం

ఓ౦ నమస్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ 
మహాదేవాయ త్రయంబకాయ 
త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ 
నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ 
సదాశివాయ శ్రీమన్-మహాదేవాయ నమః