వైభవంగా అనంత పద్మనాభ స్వామి పుట్టినరోజు వేడుకలు

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామంలోని శ్రీ మానేటి రంగనాయక స్వామి ఆలయంలో అనంత పద్మనాభ స్వామి పుట్టినరోజు వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా ఆలయ ఆవరణలో వేద పండితులు కోటి వత్తుల నోము కార్యక్రమం నిర్వహించారు.  స్వామివారికి ఆలయంలో అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, చత్తీస్​ ఘడ్ నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో కోటి వత్తుల నోము చేయించారు. భక్తులు కోటి వత్తులు వెలిగించిన తర్వాత  ఆలయంలో స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.