టెక్నాలజీ : వాట్సాప్​లో కొత్త ఫీచర్ల హంగామా

లాంగ్ వాయిస్ నోట్స్

ఇకనుంచి వాట్సాప్​లో లాంగ్ వాయిస్ నోట్స్​ను స్టేటస్ అప్​డేట్స్​గా పెట్టుకోవచ్చు. ఐఒఎస్​, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం స్టేటస్ ఫీచర్​ కెపాసిటీని పెంచినట్టు బీటా ఇన్ఫో రిపోర్ట్​లో ఇచ్చింది వాట్సాప్. దీంతో ఇకపై ఒక నిమిషం నిడివిలో వాయిస్ నోట్స్​ షేర్​ చేసుకోవచ్చు. వాట్సాప్​ కొత్త వెర్షన్​లకు అప్​డేట్ చేసే యూజర్​లు ఇప్పుడు స్టేటస్​ అప్​డేట్ ద్వారా లాంగ్ ఆడియో మెసేజ్​లను రికార్డ్​ చేయొచ్చు. అలాగే షేర్ చేయొచ్చు. ఈవెంట్స్, అడ్వర్టైజ్​మెంట్స్​ వంటివి ఏవైనా30 సెకన్ల కంటే ఎక్కువ టైం పట్టే వీడియోలను షేర్ చేయడానికి ఈ అప్​డేట్ తీసుకొచ్చింది. 

ఎలా పనిచేస్తుందంటే..

డబ్ల్యూఏ బీటా ఇన్ఫో షేర్ చేసిన స్క్రీన్​ షాట్ ప్రకారం, యూజర్లు చాట్​లో వాయిస్​ నోట్​ను పంపుతున్నట్టే మైక్​ బటన్​ నొక్కి పట్టుకుని వాయిస్​ నోట్స్​ రికార్డ్​ చేయొచ్చు. అదేవిధంగా వాయిస్​ నోట్​ని క్యాన్సిల్​ చేయడానికి స్లయిడ్​ కూడా చేయొచ్చు. ఈ కొత్త ఫీచర్​ కొంతమంది యూజర్లకు లేటెస్ట్​ వాట్సాప్​ వెర్షన్​తో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్​ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్​లో అప్​డేట్​ చూడొచ్చు. ఐఒఎస్​ యూజర్లు యాప్​ స్టోర్ నుంచి డౌన్​లోడ్ చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో ఈ ఫీచర్​ మరింత మంది యూజర్లకు అందుబాటులోకి రానుంది.