దీర్ఘశ్రేణి గ్లైడ్​ బాంబు గౌరవ్​ సక్సెస్

దేశీయంగా రూపొందించిన దీర్ఘ శ్రేణి గ్లైడ్​ బాంబు గౌర్​వను ఒడిశా తీర ప్రాంతంలో వాయుసేనకు చెందిన ఎస్​ఈయూ–30 ఎంకే–ఐ యుద్ధ విమానం నుంచి డీఆర్​డీవో తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. దీన్ని ప్రయోగించగా లాంగ్​ వీలర్​ దీవిలో ఉంచి లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. 

గౌరవ్​ను హైదరాబాద్​లోని రీసెర్చ్​ సెంటర్​ ఇమారత్​ రూపొందించి అభివృద్ధి చేసింది. గౌరవ్​ అనేది గాలిలో ప్రయోగించే 1000 కిలో క్లాస్​ గ్లైడ్​ బాంబు, ఇది సుదూర లక్ష్యాలను ఛేదించగలదు. ప్రయోగించిన తర్వాత ఈ గ్లైడ్​ బాంబు ఐఎన్​ఎస్​, జీపీ డేటా కలయికతో అత్యంత కచ్చితమైన హైబ్రిడ్​ నావిగేషన్​ స్కీమ్​ను ఉపయోగించి లక్ష్యం వైపు పయనిస్తుంది.