బీఆర్ఎస్​కు ఇవే చివరి ఎన్నికలు : బీర్ల ఐలయ్య

  •     ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 

యాదగిరిగుట్ట, వెలుగు : లోక్​సభ ఎన్నికలే బీఆర్ఎస్ కు చివరి ఎన్నికలు అని, ఈ ఎలక్షన్స్ తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగు అవుతుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య జోస్యం చెప్పారు. గుండాల మండలం మరిపడగ మాజీ సర్పంచ్ దుంపల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కు చెందిన 50 మంది నాయకులు ఆదివారం యాదగిరిగుట్టలో ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వారందరికీ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్శితులై వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ దాదాపు ఖాళీ అయిందని, లోక్​సభ ఎన్నికల తర్వాత మొత్తం తుడిచిపెట్టుకు పోతుందన్నారు. 

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎండిన పంటపొలాల పరిశీలన పేరుతో కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని చెప్పారు. కేసీఆర్​ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 15 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.