డిగ్రీతో బ్యాంక్ ఉద్యోగాల జాతర.. వెంటనే అప్లై చేసుకోండి

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఆఫీస్- దేశవ్యాప్తంగా యూబీఐ శాఖల్లో 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్‌‌లైన్ అప్లికేషన్స్​ కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్‌‌ 13వ తేదీలోగా అప్లై చేసుకోవచ్చు.

ఖాళీలు: మొత్తం 1500 లోకల్​ బ్యాంక్​ ఆఫీసర్ ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్- 200, అస్సాం- 50, గుజరాత్- 200, కర్ణాటక- 300, కేరళ- 100, మహారాష్ట్ర- 50, ఒడిశా- 100, తమిళనాడు- 200, తెలంగాణ- 200, పశ్చిమ్‌‌ బెంగాల్- 100 ఉన్నాయి.
అర్హతలు: ఏదైనా విభాగంలో రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 1 అక్టోబర్​ 2024 నాటికి 2‌‌‌‌0 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నెలకు రూ.48,480 నుంచి - రూ.85,920 చెల్లిస్తారు.

సెలెక్షన్​ ప్రాసెస్: ఆన్‌‌లైన్ పరీక్ష/ గ్రూప్ డిస్కషన్/ అప్లికేషన్స్ స్క్రీనింగ్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎగ్జామ్​ ప్యాటర్న్​: రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ (45 ప్రశ్నలు- 60 మార్కులు), జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌‌నెస్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), డేటా అనాలిసిస్ & ఇంటర్‌‌ప్రెటేషన్ (35 ప్రశ్నలు- 60 మార్కులు), ఇంగ్లీష్ లాంగ్వేజ్ (35 ప్రశ్నలు- 40 మార్కులు), ఇంగ్లీష్ లాంగ్వేజ్- లెటర్ రైటింగ్ & ఎస్సే (2 ప్రశ్నలు- 25 మార్కులు).
అప్లికేషన్స్​: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో అక్టోబర్​ 24 నుంచి నవంబర్​ 13 వరకు దరఖాస్తు చేసుకోవాలి.  అప్లికేషన్ ఫీజు జనరల్‌‌/ ఈడబ్ల్యూఎస్‌‌/ ఓబీసీ అభ్యర్థులకు రూ.850. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.175 చెల్లించాలి. పూర్తి వివరాలకు www.unionbankofindia.co.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.