నిజామాబాద్‌లో ప్రైవేట్​ బ్యాంక్​ రికవరీ ఆఫీసర్​ మోసం

నిజామాబాద్​, వెలుగు: నగరంలోని ఒక ప్రైవేట్​ బ్యాంక్​లో  లోన్​ రికవరీ ఆఫీసర్​గా పనిచేసే దత్తురెడ్డి మోసానికి పాల్పడ్డాడు. లోన్​లపై వాహనాలు కొనుగోలు చేసిన వారి నుంచి కిస్తులు వసూలు చేసి ​ బ్యాంక్​లో జమ చేయలేదు. ఈఎంఐలు బాకీ ఉన్నట్లు ఫోన్​లకు మెసేజ్​లు రావడంతో గురువారం  ఆరా తీయడానికి బాధితులు వెళ్లగా విషయం బయటపడింది. నగరంలోని వినాయక్​నగర్​కు చెందిన విష్ణుప్రసాద్​, జక్రాన్​పల్లికి చెందిన శ్రీనివాస్​, మెంట్రజ్​పల్లికి వాసి గంగాదాస్​ ప్రైవేట్​ బ్యాంకు నుంచి లోన్ తీసుకొని ఆయా వెహికల్స్​ కొన్నారు.

రెగ్యూలర్​గా వెళ్లి రికవరీ ఆఫీసర్​ దత్తురెడ్డికి కిస్తులు డబ్బు చెల్లిస్తున్నారు. ఇలా ఈ ముగ్గురి నుంచి  రూ.3 లక్షలకు మించిన డబ్బు మూడు నెలల నుంచి తీసుకొని స్టాంప్​లేని రిసిప్ట్​ ఇచ్చి పంపుతున్నాడు. వాటిని రుణగ్రహీతలు అసలు రశీదులుగా భావించారు. అయితే మూడు నెలల ఈఎంఐలు డ్యూస్​ ఉన్నాయనే  మెసేజ్ లు   రావడంతో  బ్యాంకుకు రాగా ఆయన కనిపించలేడు.  చీఫ్​ మేనేజర్​ సూర్య వద్దకు వెళ్లి కలవగా.. దత్తురెడ్డి పది రోజుల నుంచి రావడం లేదని ఆయన వారికి సమాధానం ఇచ్చారు.  రికవరీ ఆఫీసర్​గా దత్తురెడ్డి ఎంత మందిని మోసం చేశాడనే విషయాన్ని  ఎంక్వయిరీ చేస్తామని బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చీఫ్​ మేనేజర్​ వారికి నచ్చజెప్పారు.  ముగ్గురు బాధితులు ఫోర్త్​ టౌన్​లో ఫిర్యాదు చేశారు.