డైనోసార్ల సాహసాలు
టైటిల్ : లిటిల్ స్టాంపర్స్ (యానిమేషన్)
డైరెక్షన్ : గ్రెగ్ రిచర్డ్సన్
డబ్బింగ్ ఆర్టిస్ట్ : ఒలీవర్ డ్యుచ్, జాషువా ఒబసి, సబ్రిన మరియెల్లె
లాంగ్వేజ్ : ఇంగ్లిష్
ప్లాట్ ఫాం : జియో సినిమా
మూడు రంగుల్లో ముచ్చటగొలిపే డైనోసార్ పిల్లల స్టోరీ ఇది. అవి తమ చుట్టూ ఉన్న అద్భుతమైన ప్రపంచాన్ని చూడటానికి బయలుదేరతాయి. ఆ సమయంలో అవి చేసే అడ్వెంచర్స్ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఒక పక్క సాహసాలు చేస్తూనే మరో పక్క నాలెడ్జ్ సంపాదిస్తాయి. ఒకరికొకరు సాయం చేసుకుంటూ లైఫ్‌లో ఉండే కష్టమైన అంశాల్ని తెలుసుకుంటాయి. చిన్నారులకు ఎంతో నచ్చే యానిమేషన్ క్యారెక్టర్స్‌తో ఈ చిట్టి కథను తెరకెక్కించారు డైరెక్టర్. దీని రన్ టైం 25 నిమిషాలు. కాబట్టి ఈ సినిమా సరదాగా చూడొచ్చు. ఇందులో క్యారెక్టర్స్‌కి చిన్నారులు చెప్పిన డబ్బింగ్ బాగుంది.
టామీ, అమలు లవ్ సక్సెస్ అయిందా!
టైటిల్ : వలట్టి ( టేల్ ఆఫ్ టెయిల్స్)
డైరెక్షన్ : దేవన్
కాస్ట్ : విజయ్ బాబు, రఘు సుభాష్ చంద్రన్, ఇంద్రన్స్
లాంగ్వేజ్ : మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ
ప్లాట్ ఫాం : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
టామీ, అమలు అనే రెండు కుక్కలు ప్రేమలో పడతాయి. కానీ, వాటి యజమానులు వాటి ప్రేమను అంగీకరించరు. ఆ ఇద్దరు యజమానులు వేర్వేరు మతాలకు చెందినవాళ్లు కావడమే ఇందుకు కారణం. వాళ్లలో ఒకరిది పాలక్కడ్‌లో ఉండే అయ్యర్ ఫ్యామిలీ. వాళ్లు వెజిటేరియన్స్. రెండో యజమాని నాన్‌వెజ్‌ని ఇష్టంగా తినేవాళ్లు. అందుకని వాళ్లు పెంచుకునే కుక్కలు కూడా వాళ్ల పద్ధతిలోనే ఉండాలనుకుంటారు. కానీ... టామీ, అమలు ఒకదాన్ని విడిచి మరొకటి ఉండలేక ఇద్దరూ కలిసి పారిపోవాలి అనుకుంటారు. ఆ తర్వాత ఏమైందనేదే వలట్టి కథ. టోమీ, అమలు ప్రేమ గెలిచిందా? లేదా? తెలుసుకోవాలంటే వలట్టి : టేల్ ఆఫ్ టెయిల్స్ చూడాల్సిందే. ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ఎంటర్టైన్ చేస్తుంది. ఇందులో చూపించింది జంతువుల ప్రేమ కథే అయినా, మనుషులకు పనికొచ్చే విషయాలు కూడా చెప్పారు. గ్రాఫిక్స్ లేకుండా నేచురల్‌గా తీసిన ఈ సినిమాలో విజువల్‌గా ఆకట్టుకుంటుంది.
అతడు రాజ్యాన్ని కాపాడతాడా?
టైటిల్ : ది వింటర్ కింగ్
డైరెక్షన్ : ఒట్టో బాతర్స్ట్
కాస్ట్ : లెయిన్ డి సీస్టెకర్, స్టువర్ట్ క్యాంప్‌బెల్, వాలెనె కేన్, సైమన్ మెర్రెల్స్, ఎల్లీ జేమ్స్, డేనియల్ ఇంగ్స్, నతానియేల్ మార్టెల్లో వైట్, సాగర్ ఆర్య, స్టీవెన్ ఎల్డర్
లాంగ్వేజ్ : ఇంగ్లిష్
ప్లాట్ ఫాం : సోనీ లివ్
ఈ కథ ఫేమస్ రైటర్ బెర్నార్డ్ కార్న్వెల్ రాసిన ‘ది వార్లార్డ్ క్రానికల్స్’ అనే నవల నుంచి తీసుకున్నారు. శాక్సన్స్, దుమ్నోనియా మధ్య యుద్ధం అయిపోయినప్పటినుంచీ మొదలవుతుంది ఈ సిరీస్. ఇందులో ఆర్థర్ పెనెడ్రాగన్ (లెయిన్ డి సీస్టెకర్) శక్తివంతమైన వీరుడు. చీకటి యుగంలో తన బ్రిటన్ రాజ్యంలోనే బహిష్కరణకు గురైన యోధుడు ఆర్థర్. అయితే, యోధుడైన ఆర్థర్ బహిష్కరణ తర్వాత సన్యాసిగా మారిపోతాడు. అలాంటివాడు తిరిగి రాజు అవ్వడం కుదరదు. ఆ సమయంలో శాక్సన్లు దేశంపై దండెత్తుతారు. అప్పుడు పిల్లవాడు అయిన రాజు పరిపాలిస్తుంటాడు. అతనికి ఎలాంటి పవర్స్ ఉండవు. మరి ఆర్థర్ తన రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు? తిరిగి రాజు అవ్వగలిగాడా? అనేది మిగతా కథ. పది ఎపిసోడ్లుగా తీసిన ఈ సిరీస్‌లో నటించిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుంది. కాకపోతే ఒక్కో ఎపిసోడ్ 50 నిమిషాల నుంచి గంట వరకు ఉంటుంది.