వార్నింగ్: లిక్విడ్ మౌత్ ఫ్రెష్నర్ వాడితే క్యాన్సర్ రిస్క్

ప్రస్తుత రోజుల్లో టైం లేక, బద్దకం ఎక్కవై పళ్లు తోమడానికి బదులు ఈజీగా ఉంటుందని లిక్విడ్ మౌత్  ఫ్రెష్నర్లు వాడుతుడున్నారు. చాలా సింపుల్‌గా నోట్లో పోసుకొని పుక్కిలించి బ్రష్ చేయకుండా సరిపెట్టుకుంటున్నారు. కానీ లిక్విడ్ మౌత్ ఫ్రెష్నర్లో ఉండే లిస్టెరిన్ అనే కెమికల్ క్యాన్సర్ కు దారితీస్తుందని  జర్నల్ ఆఫ్ మెడికల్ మైక్రోబయాలజీ హెచ్చరిస్తోంది. లిస్టెరిన్ రసాయనం చిరుళ్ల సమస్యలు, అన్నవాహిక (కొలొరెక్టల్) క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమైతుందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. 

అంతేకాదు ఈ లిక్విడ్ మౌత్ ఫ్రెష్నర్ లో ఉండే కెమికల్స్ వల్ల నోటిలో బ్యాక్టీరియా కూడా పెరుగిపోతుందని ఓ రీసెర్చ్ లో తేలింది. ఫ్యూసోబాక్టీరియం న్యూక్లియేటం, ఆంజినోసస్ రక్తంలో కలిసి నోటి ఆరోగ్యాన్ని  దెబ్బతీస్తాయట.  రోజూ లిస్టెరిన్ వాడటం వల్ల రెండు రకాల బాక్టీరియా నోట్లో పెరిగిపోయని సెంటిస్టులు చెబుతున్నారు. ఇగుళ్ల వాపు, ఇన్ఫెషన్లు కూడా  లిస్టెరిన్ రసాయనం వల్ల వస్తాయని తేలింది. మన నోటి ఆరోగ్యం చాలా ముఖ్యం ఎందుకంటే జీర్ణక్రియ ప్రక్రియ ఇక్కడి నుంచే మొదలవుతుంది కాబట్టి. నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి.. అందు కోసం రెగ్యెలర్ బ్రషింగ్, ఫ్లాషింగ్, డెంటల్ చెక్ అప్ లతో నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.