లిక్కర్ స్కాంలో కీలకపరిణామం చోటు చేసుకుంది. బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో నాలుగు గంటల పాటు సోదాలు జరిపిన అధికారులు కవితను అరెస్ట్ చేశారు. ఈ విషయంపై కవిత తరఫు న్యాయవాది సోమా భరత్ స్పందించారు.సుప్రీం కోర్టులో ఈడీ అండర్ టేకింగ్ ఇచ్చింది.. ఎలాంటి చర్యలు తీసుకోము అని ఈడీ కోర్టులో చెప్పిందని పేర్కొన్నారు. ఢిల్లీ నుండి ఈడీ అధికారులు ఇలా రావడం కరెక్ట్ కాదన్నారు. సుప్రీంకోర్టులో కవిత కేసు పెండింగ్ ఉంది.. పెండింగ్ లో కేసు ఉండగా ఈడీ అధికారులు ఎలా కవిత ఇంటికి వస్తారని ప్రశ్నించారు.
మరోవైపు.. సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు మాట్లాడుతూ... కవిత వేసిన పిటిషన్ కూడా ఇంటి వద్ద విచారించాలనేనని ఆయన తెలిపారు. ఈరోజు ఎలాంటి చర్యలు ఈడీ తీసుకోదని.. ఒకవేళ ఈడీ ఏదైనా చర్య తీసుకుంటే, అది కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అవుతుందని అన్నారు. సుప్రీం కోర్టులో ఈడీ అండర్ టేకింగ్ ఇచ్చింది.. ఎలాంటి చర్యలు తీసుకోము అని ఈడీ కోర్టులో చెప్పిందని పేర్కొన్నారు. ఈ నెల 19న సుప్రీం కోర్టులో విచారణ ఉందని.. స్టేట్మెంట్ రికార్డ్ లో భాగంగా సెల్ ఫోన్ లు సీజ్ చేస్తారని అన్నారు. కవిత ఒక మహిళ కాబట్టే ఇంటికి వచ్చి ఈడీ అధికారులు విచారిస్తున్నారని చెప్పారు.