లింక్డిన్‌లో ఈ మూడు గేమ్స్

లింక్డిన్ కూడా గేమింగ్​లోకి ఎంటర్ అయిపోయింది. పిన్​పాయింట్, క్వీన్స్, క్రాస్ క్లయింబ్​ పేరుతో మూడు గేమ్స్ తెచ్చింది. మొబైల్ యాప్, వెబ్​సైట్​లోనూ వీటిని ఆడేయొచ్చు. ఈ గేమ్స్​ ‘మై నెట్​వర్క్’​ ట్యాబ్​లో చూడొచ్చు. డెస్క్​టాప్​లో న్యూస్ సెక్షన్​లోనూ అందుబాటులో ఉంటాయి. వర్డ్​లీ వంటి గేమ్స్ ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. లింక్డిన్ కూడా​ అలాంటి గేమ్స్ తీసుకొచ్చింది. 

దీన్ని న్యూస్​ డిపార్ట్​మెంట్​కి చెందిన గేమ్స్​ ఎడిటర్ పావోలో పాస్కో డిజైన్ చేశాడు. అంతకుముందు ఇతను అమెరికన్ వ్యాల్యూస్ క్లబ్ క్రాస్​వర్డ్​ పేరుతో వచ్చే వీక్లీ క్రాస్​వర్డ్​లో పనిచేశాడు. ఈ ఏడాది అమెరికన్ క్రాస్​వర్డ్​ పజిల్​ టోర్నమెంట్ విన్నర్ కూడా. అయితే, ఇతను తయారుచేసిన ఈ మూడు గేమ్స్ రోజుకు ఒకసారి ఆడొచ్చు. ఆడాలనుకున్న వాళ్ల కాంటాక్ట్​లో ఎవరెవరు? ఏ ఆటను? ఆడారో కూడా తెలుసుకోవచ్చు. స్కూల్​, కంపెనీ నెట్​వర్క్స్​లో ఎవరు బాగా ఆడారో కూడా లీడర్​ బోర్డ్ ​రూపంలో కనిపిస్తుంది.