ఫేస్బుక్ లింక్ హిస్టరీ అనే కొత్త ఫీచర్‌ని తెచ్చింది. లింక్ హిస్టరీ అనేది మొబైల్లోని ఫేస్బుక్ యాప్‌లో ఒక ఫీచర్. ఇది యాప్‌లో క్లిక్ చేసిన లింక్స్‌ను ట్రాక్ చేసి చూపిస్తుంది. ఇందులో పోస్ట్, కామెంట్, మెసేజ్‌లు ఉంటాయి. ఫేస్బుక్ ఈ డాటాను30 రోజుల పాటు స్టోర్ చేసి ఉంచుతుంది. డిలీట్ చేస్తే తప్ప అవి పోవు. ఈ ఫీచర్ ద్వారా ముప్పై రోజుల ఫేస్బుక్ హిస్టరీ చూడొచ్చు.
అదెలాగంటే..
ఫేస్బుక్లో లింక్ మీద క్లిక్ చేస్తే... దేని మీద క్లిక్ చేశారో ఆ యూఆర్ఎల్, ఎప్పుడు క్లిక్ చేశారో ఆ టైం రికార్డ్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ లింక్ హిస్టరీ కింద స్టోర్ అవుతుంది. లింక్ హిస్టరీ థర్డ్ పార్టీ కంపెనీలకు షేర్ కాదని కంపెనీ చెప్పింది. ఇది కేవలం ఆప్షనల్ ఫీచర్. కాబట్టి దీన్ని ఎప్పుడైనా సరే ఫేస్బుక్ యాప్ సెట్టింగ్స్‌లో ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. యూజర్లు లింక్ హిస్టరీ డాటాని ఎప్పుడైనా డిలీట్ చేయొచ్చు.
ఇలా చేయాలి
ఫేస్బుక్ యాప్‌లో ఉన్న ఏదైనా లింక్‌ని ఓపెన్ చేయాలి. కింద కుడివైపు ఉన్న మూడు చుక్కల్ని ట్యాప్ చేసి, బ్రౌజర్ సెట్టింగ్స్ సెలక్ట్ చేయాలి. సెట్టింగ్స్ ఆన్ లేదా ఆఫ్ చేయడానికి టోగుల్ మీద ట్యాప్ చేయాలి.