కాంగ్రెస్​లో చేరిన లింగంపేట ఎంపీపీ గరీబున్నీసా బేగం

లింగంపేట, వెలుగు: లింగంపేట ఎంపీపీ గరీబున్నీసా బేగం, బీఆర్ఎస్​ మండల ప్రధాన కార్యదర్శి అట్టెం శ్రీనివాస్ 50 మంది కార్యకర్తలతో కలిసి ఆదివారం ఎమ్మెల్యే మదన్​మోహన్​ సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. వీరందరికి ఎమ్మెల్యే కాంగ్రెస్​ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్​లో చేరుతున్నట్లు ఎంపీపీ గరీబున్నీసా బేగం చెప్పారు.

ఎమెల్యే మదన్​మోహన్​రావు మాట్లాడుతూ త్వరలో జరిగే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్​అభ్యర్థి సురేశ్​శెట్కర్​ భారీ మెజార్టీతో  గెలిపించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో లింగంపేట సింగిల్​విండో డైరెక్టర్లు అట్టెం సత్యవ్వ, నీరడి రామలింగం, పోచమ్మ కాడి సత్యం, అయ్యపల్లి సర్పంచ్​ శంకరప్ప,శెట్​పల్లి, అయ్యపల్లి గ్రామాల బీఆర్ఎస్​ గ్రామ కమిటీ అధ్యక్షులు మన్నె బాలయ్య,చల్లచిన్న మల్లయ్య, సీనియర్​ లీడర్​ అబ్దుల్​నయీం ఉన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు​బుర్ర నారాగౌడ్, యూత్​ అధ్యక్షుడు సుప్పాల రాజు, సోషల్​మీడియా కోఆర్డినేటర్​ నగేశ్​పాల్గొన్నారు.