మరమ్మతు చేస్తుండగా లైన్ మాన్ కు గాయాలు

బాన్సువాడ, వెలుగు: బాన్సువాడ మండలం తాడుకోలు శివారులో ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతు చేస్తుండగా..   లైన్‌‌‌‌ మాన్ దస్తగిరికి విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి.  ఆయన్ను  హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  టీఎన్పీడీసీఎల్ డీఈ కామేశ్వర రావు తెలిపిన వివరాల ప్రకారం..  దస్తగిరి ట్రాన్స్‌‌‌‌ఫార్మర్ రిపేరు చేస్తుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొద్ది దూరంలో చెట్లు కొట్టేస్తుండగా లైన్ మీద పడి పెద్ద లైనుకు తగిలి కరెంటు పాస్ అయింది. దస్తగిరికి కరెంట్ షాక్ తగిలి కింద పడిపోయాడు.  అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయన్ను బాన్సువాడ ఆసుపత్రిలో చికిత్స చేయించి హైదరాబాద్ కు తరలించారు.