అనారోగ్య సమస్యలా..ఈ స్పెషల్ హనీతో చెక్ పెట్టండి

తేనె అంటే మనకు తెలుసు.. ఇది తేనే టీగలనుంచి వస్తుంది.. ఇప్పుడు కృత్రిమంగా కూడా తయారు చేస్తున్నారు. కృత్రిమ తేనే రకాల్లో మానుకా తేనె చాలా ప్రత్యేకమైనది. దీనిని మానుకా చెట్టు మకరందాన్ని ఉపయోగించి తయారు చేస్తారు. మామూలు తేనే కన్నా దీని తీపి కాస్త తక్కువగా ఉంటుంది. మామూలు తేనేలాగే మానుకా తేనేను కూడా రోజూ వాడొచ్చు. రోజూ రెండు చెంచాల తేనె తీసుకోవచ్చు. 

మానుకా తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ప్రీ రాడికల్స్ వల్ల శరీరం దెబ్బతినకుండా ఇది కాపాడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడుతుంది. మానుకా తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు చర్మ మీద అయిన గాయాలను తగ్గించడంతో సాయపడతాయి. 

యాసిడ్ రిఫ్లక్స్, అజీర్తి,కడుపులో అల్సర్లు లాంటివి వుంటే మానుకా తేనె నయం చేస్తుంది. జీర్ణ సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. గొంతులో నొప్పి ఉంటే మానుకా తేనె తగ్గిస్తుంది. ఈ తేనెలో యాంటీ వైరల్ లక్షణాలు గొంతు నొప్పి తగ్గించడంలో సాయపడుతుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలు ఉంటే మానుకా తేనె బాగా పనిచేస్తుంది. ఎక్కువ మోతాదులో  కాకుండా తక్కువ మోతాదులో తీసుకోవాలి.