Good Health : వేడి వేడిగా అన్నం తింటున్నారా.. ఇదిగో ఇలాంటి సమస్యలు వస్తాయి..!

Hot Food Effects:  అందరికి హాట్ ఫుడ్ తినాలని కోరిక ఉంటుంది. వాస్తవానికి వేడి ఆహారం చాలా రుచిగా ఉంటుంది.  ఈ కారణంగా చాలా మంది ఆహారం వేడిగా ఉన్నప్పుడే తింటారు. కానీ ఇది శరీరానికి హానిని కూడా కలిగిస్తుంది. చల్లటి ఆహారం రుచిగా లేకపోయినా... వేడి వేడిగా తినడం మంచిది కాదు. వేడి ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల శరీరానికి ఎలాంటి హాని కలుగుతుందో తెలుసుకుందాం.

వేడి ఆహారాన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల కడుపు దెబ్బతింటుంది. పొట్టలోపల ఉండే సున్నితమైన చర్మం పాడైపోతుంది. ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు కడుపులో మంట, నొప్పి ఏర్పడుతాయి.

పొట్టకు నష్టం: ఆహారం అతిగా వేడిగా తినడం ఆరోగ్యానికి హానికరం. వేడి ఆహారాన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల కడుపు దెబ్బతింటుంది. పొట్టలోపల ఉండే సున్నితమైన చర్మం పాడైపోతుంది. ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు కడుపులో మంట, నొప్పి ఏర్పడుతాయి.ఇది కడుపులో చికాకు ... కడుపు పూతలకి కూడా కారణమవుతుంది. చాలా వేడి ఆహారాన్ని తినడం వల్ల ఎసిడిటీ, వికారం మరియు వాంతులు వచ్చే ప్రమాదం ఉంది.

నాలుక కాలిపోతుంది.. కొన్నిసార్లు ప్రజలు వేడి ఆహారం తినే ప్రక్రియలో నాలుకని కాల్చుకుంటారు. ఇలా చేయడం వల్ల నోటిలోపల చాలా సమస్యలు వస్తాయి. ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలా పొరపాటున జరిగినా కాలిన ప్రాంతం నయం కావాలంటే చాలా రోజులు పడుతుంది. అప్పుడు చల్లని ఆహారాన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.

 దంతాలకు నష్టం:  నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చాలా వేడి, చాలా చల్లదనం దంతాలకు హాని కలిగిస్తుంది. చాలా వేడి ఆహారాన్ని తీసుకోవడం వల్ల దంతాలలో ఉండే ఎనామిల్ పగుళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల దంతాల ఆరోగ్యం పాడవుతుంది. దీంతో పాటు దంతాల అందంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది.

 గొంతు మంట :  వేడి-వేడి ఆహారాన్ని తినడం వల్ల గొంతుకు చాలా నష్టం జరుగుతుంది. దీని కారణంగా గొంతు లోపలి నుంచి కాలిపోతుంది. వాపు వస్తుంది. ఈ సమస్యని అనేక హోం రెమిడీస్‌తో తగ్గించుకోవచ్చు. కానీ ఒక్కోసారి పెద్దగా మారినప్పుడు వైద్యుని సలహా తీసుకోవడం కచ్చితంగా అవసరం.  దీని ప్రభావం చాలా రోజులు ఉంటుంది. కొన్నిసార్లు చాలా వేడి ఆహారాన్ని తినడం వల్ల గొంతులో వాపు వస్తుంది మరియు ప్రేగులు కూడా దెబ్బతింటాయి.