తిమ్మారెడ్డి ప్రాంతంలో .. కళ్యాణి ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేత

ఎల్లారెడ్డి, వెలుగు: ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి శివారు ప్రాంతంలో ఉన్న కళ్యాణి ప్రాజెక్ట్ రెండు గేట్లను ఎత్తి 450 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి మరో  200 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ ద్వారా ఆయకట్టుకు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ ఏఈ శివకుమార్ తెలిపారు.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 409.50 మీటర్లకు గాను ప్రస్తుతం 408 .50 మీటర్ల నీరు నిల్వ ఉందని తెలిపారు. గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు దిగువ ప్రాంతం నుండి 650 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తుందని  తెలిపారు.