యూట్యూబర్..టిక్‌‌‌‌టాక్‌‌‌‌తో మొదలుపెట్టి..

అతనికి డాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంటే చాలా ఇష్టం. అందుకే కష్టపడి డాన్స్​ నేర్చుకున్నాడు. ఆ తర్వాత టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాట్​ఫామ్​ మీద సోషల్ మీడియా లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టాడు. వీడియోలు చేసి, లక్షల మంది ఫాలోవర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సంపాదించుకున్నాడు. కానీ.. కష్టపడి కట్టిన పేకమేడ చిన్న గాలికే కూలిపోయినట్టు.. ఇండియన్​ గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని బ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంతో అతను కట్టుకున్న టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుప్పకూలింది. 

అయ్యో అనుకున్నాడే కానీ అధైర్యపడలేదు. యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జర్నీ మొదలుపెట్టాడు. మళ్లీ అభిమానులను సంపాదించుకున్నాడు. సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ ఇన్​ఫ్లుయెన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా దూసుకుపోతున్న ఇతగాడి పేరు ఎస్డీ మండల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. 

ఎస్డీ మండల్ ఫేమస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూట్యూబర్, డాన్సర్, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్ స్టార్. ఎక్కువగా డాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీడియోలతో యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఆకట్టుకుంటున్నాడు. రకరకాల కవర్ సాంగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీడియోలు చేస్తున్నాడు. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు చాలా సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మండల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫాలోయింగ్ ఉంది. 

యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అతను చేసే వ్లాగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి కూడా వ్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాగానే వస్తుంటాయి. ఎస్డీ మండల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతాలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో 1999 ఫిబ్రవరి 17న పుట్టాడు. తల్లిదండ్రులు చాలా కష్టపడి అతన్ని చదివించారు. అతనికి ఒక అక్క ఉంది. ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా స్థానికంగా ఉన్న గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే పూర్తి చేశాడు. హైస్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎడ్యుకేషన్ మాత్రం ప్రైవేట్ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చదివాడు. తర్వాత కోల్​కతాలో బీకామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తి చేశాడు. 

టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మొదలు...

మండల్ సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియా లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మొదలైంది. కరోనాకు ముందు టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలా ఫేమస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండేది. ముఖ్యంగా యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఎక్కువగా ఎట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. ప్రతి టీనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాక్ యాప్ ఉండేది. అలాంటి టైంలో మండల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వీడియోలు చేయాలి అనుకున్నాడు. దాంతో 2019లో మొదటి వీడియో చేసి, టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. అప్పట్లో లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీడియోలు ఎక్కువగా చేసేవాడు. కానీ.. వాటికి వ్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెద్దగా వచ్చేవి కాదు. 

అయినా.. పట్టు వదలకుండా వీడియోలు పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. అలాంటి టైంలో అనుకోకుండా ఒక  వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ వీడియో వల్లే మండల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చాలామంది ఫాలోవర్స్ వచ్చారు. ఆ ఉత్సాహంతో మంచి కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వీడియోలు చేశాడు. ముఖ్యంగా డాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. దాంతో ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతూ7 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ వచ్చారు. 

అతని టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 16 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. కానీ.. అంతలోనే ఇండియాలో టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. దాంతో అతనికేం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే అందరూ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో షార్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం మొదలుపెట్టారు. దాంతో మండల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఈ రెండింటి మీద ఫోకస్ పెట్టాడు.  

లక్షల మంది అభిమానం

టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే మండల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఎక్కువ గుర్తింపు వచ్చింది. మండల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2020 మార్చి 7న ‘‘ఎస్డీ మండల్ అఫీషియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌” పేరుతో యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టాడు. ఇందులో ఎక్కువగా డాన్స్ షార్ట్ వీడియోలు, వ్లాగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తుంటాడు. అతను అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన ఒక షార్ట్ వీడియోకు ఏకంగా 45 మిలియన్ల వ్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చాయి. పది మిలియన్లకుపైగా వ్యూస్ సాధించిన డాన్స్ వీడియోలు అతని ఛానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చాలానే ఉన్నాయి.  

మండల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పటివరకు 941 వీడియోలు అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. డాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు యాక్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ తన టాలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని పరీక్షించుకుంటున్నాడు. మండల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రస్తుతం 1.89 మిలియన్ల సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రయిబర్స్ ఉన్నారు. యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే కాదు.. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా ఇతని వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. ఎస్డీ మండల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అఫీషియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో ఉన్న అతని ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టా ఐడీలో రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తుంటాడు. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇప్పటివరకు1.3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. 

అతను ‘మోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అనే మరో సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియా వీడియో షేరింగ్ ఫ్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా యాక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నాడు. అందులో అతనికి 2.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఆ పేజీకి 38 మిలియన్ల లైక్స్ వచ్చాయి. అంతేకాకుండా డైలీ వ్లాగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడానికి ‘‘ఎస్డీ మండల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్లాగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌” పేరుతో మరో యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా నడుపుతున్నాడు. ఈ ఛానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 86 వేల మంది సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రయిబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారు. ఇందులో ఇప్పటివరకు 74 వీడియోలు అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. 

కాకపోతే ఈ ఛానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని తన మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంటే ముందే అంటే 2018లోనే క్రియేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఇప్పటివరకు ఎస్డీ మండల్ సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియా ద్వారా బాగానే సంపాదించాడు. ప్రమోషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా కూడా ఆదాయం వస్తోంది.