New Year 2025 : ఏయే రాశుల వారికి.. కొత్త ఏడాదిలో ప్రేమ, పెళ్లిళ్లు.. అనుబంధాలు కలిసొస్తాయ్..?

కొత్త సంవత్సరంలో చాలా మారిపోతుంటాయి. గత సంవత్సరం మిగిల్చిన చేదు జ్ఞాపకాలకు గుడ్ బై చెప్పి ఈ సంవత్సరమైనా అనుకున్నవన్నీ జరగాలని ఆశతో ఉంటుంటాం. ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కో కల. ఉద్యోగ ప్రయత్నం కలిసిరావాలని కొందరు, వ్యాపారంలో వృద్ధి సాధించాలని ఇంకొందరు, ప్రేమ సఫలమవ్వాలని మరికొందరు, ఈ సంవత్సరమైనా పెళ్లి సెట్ అయితే బాగుండనే ఆశతో ఉండే కొన్ని బ్యాచిలర్ జీవితాలు. అయితే.. ఇలా ఆశలను నిజం చేసుకునే వారిలో చాలామంది రాశి ఫలాల్లో తమ రాత ఎలా ఉందో చూసుకుంటుంటారు. గతం చేసిన గాయాలను మాన్పగలిగే శక్తి ఒక్క ప్రేమకు మాత్రమే ఉంది. నిస్వార్థమైన ప్రేమ దొరికితే ఏ చీకూచింతా లేకుండా హ్యాపీగా బతికేయొచ్చు. ఇలా ప్రేమ కోసం పరితపిస్తూ సింగిల్స్గా మిగిలిపోయిన వాళ్ల జీవితాల్లో 2025 ఎలాంటి వెలుగులు నింపబోతోందో, ఏఏ రాశి వారికి లవ్ లైఫ్, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండబోతోందో సవివరంగా తెలుసుకుందాం..

మేషం: మేష రాశి వారికి 2025 కలిసొచ్చే సంవత్సరం అనే చెప్పాలి. టైం పాస్ ప్రేమలు పక్కనపెట్టి, నెగిటివిటీని దూరం చేసుకుని నిస్వార్థమైన ప్రేమ కోసం ఎదురుచూస్తున్న వారిని మీనింగ్ఫుల్ లవ్ వెతుక్కుంటూ వస్తుంది. టైం పాస్ లవ్గా మిగిలిపోయే రిలేషన్షిప్స్ కోసం పరితపించడం మానేసి రైట్ టైం కోసం వెయిట్ చేస్తే సరిపోతుంది. కమిటెడ్ రిలేషన్లో ఉన్న జంటలకు తమ మధ్య వస్తున్న మనస్పర్థలకు 2025లో పరిష్కారం దొరుకుతుంది.

వృషభం: ఈ రాశిలో ఉన్న సింగిల్స్ నిరీక్షణకు శుభం కార్డు పడే సంవత్సరం 2025. శని ప్రభావం వల్ల టైం పాస్ ప్రేమల నుంచి మీ ఫోకస్ సీరియస్ రిలేషన్స్ వైపు మళ్లుతుంది. మీకు తెలిసిన సర్కిల్లోనే పార్టనర్ దొరికే ఛాన్స్ ఉంది. ఆల్ రెడీ రిలేషన్ షిప్స్లో ఉన్న వాళ్లకు తమ బంధం 2025లో మరింత దృఢంగా మారే శుభ తరుణం ఇది.

మిథునం: ఈ రాశి వారికి 2025లో శని గ్రహ ప్రభావం మేలు చేస్తుందనే చెప్పొచ్చు. వర్క్ లైఫ్ను బ్యాలెన్స్ చేసుకోవడంతో పాటు రిలేషన్ షిప్స్లో కమిట్మెంట్ను పెంపొందించుకుంటారు. మీ లక్ష్యాలను, మీ అంకిత భావాన్ని అర్థం చేసుకునే జీవిత భాగస్వామి పరిచయం అవుతారు. ఇప్పటికే ప్రేమలో ఉన్న జంట తమ బంధంలోని లోపాలను గుర్తించి పరిస్థితులను చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తారు.

కర్కాటకం: జీవితంపై మీకున్న ఆలోచనలకు, దృక్పథానికి దగ్గరగా ఉన్న వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. 2025 ఆ అవకాశాన్ని మీకు అందిస్తుంది. ట్రావెలింగ్లో మీకు జీవిత భాగస్వామి పరిచయం అయ్యే అవకాశం ఉంది. ప్రేమ లోతుల్లో మీరు మునిగిపోతారు. మీకు పరిచయం కాబోతున్న మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆధ్యాత్మిక ప్రపంచానికి పరిచయం చేస్తుంది. గుళ్లూగోపురాలు, ప్రార్థనా స్థలాలను ఇద్దరూ కలిసి ఎక్కువగా సందర్శించే అవకాశం ఉంది.

సింహం: 2025లో సింహ రాశి వారు ఆత్మ శోధనపై దృష్టి పెడతారు. బంధాల విలువ తెలిసొస్తుంది. జీవిత భాగస్వామి అవసరాన్ని గుర్తెరిగి.. మనసుకు నచ్చినట్టుగా నడుచుకుంటారు. ప్రేమానుబంధాల విషయంలో మీపై ఎదుటివారికి నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉంది. అయితే అప్పటికీ ప్రేమ విలువ తెలుసుకుని మీరు మసులుకునేలా, అడ్డంకులను అధిగమించేలా శని ప్రభావం మీపై ఉంటుంది.

కన్య: శని గ్రహ ప్రభావం వల్ల కమిటెడ్ రిలేషన్లో ఉన్న కన్య రాశి వారికి కొన్ని ఇబ్బందులు తప్పవని చెప్పక తప్పదు. అనాలోచిత నిర్ణయాలు, ఆకాంక్షలే ప్రశ్నార్థకంగా మారే ప్రతికూల పరిస్థితులు.. ఇలా కన్య రాశి వారికి లవ్, రిలేషన్ షిప్ 2025లో కలిసొచ్చేలా లేవు. 2024లో పరిష్కారం దొరకని సమస్యలకు ప్రశాంతమైన మైండ్ సెట్తో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మేలు.

ALSO READ | Horoscope : 2025లో ఏయే రాశుల వారికి డబ్బులు, ఉద్యోగంలో కలిసి వస్తుంది.. ఉన్నత స్థాయికి చేరుకుంటారు..?

తుల: ఈ రాశి వారి ప్రేమలు, పెళ్లిళ్లకు 2025 కలిసొచ్చే సంవత్సరం అనే చెప్పాలి. వ్యక్తిగత ఉన్నతికి, మనసుకు నచ్చినట్లుగా మీ అలవాట్లను, అభిరుచులను మార్చుకోవడానికి 2025 మీకు అవకాశం ఇస్తుంది. జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో శని మీకు సహాయపడుతుంది.

వృశ్చికం: లవ్ పట్ల మీకున్న అభిప్రాయం, ఆ అభిప్రాయం వల్ల మీరు ఎదుర్కొనే అడ్డంకులను శని ప్రభావం మీకు గుర్తుచేస్తుంది. మళ్లీ అదే తప్పు చేయొద్దని మీకు ఎదురయ్యే కొన్ని పరిస్థితులు హెచ్చరిస్తాయి. వైవాహిక జీవితానికి ఈ రాశిలో ఉన్న కొందరు ప్రాముఖ్యత ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తారు. అయితే అది ఎంత తప్పో తెలుసుకుని తిరిగి జీవిత భాగస్వామి ప్రేమను పొందుతారు.

ధనుస్సు: 2025 ఈ రాశి వారికి ఏకాంతాన్ని పరిచయం చేస్తుంది. లవ్, బ్రేకప్.. ఇలా రిలేషన్స్ వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులను గ్రహించి తమను తాము మార్చుకోవాల్సిన అవసరాన్ని 2025 గుర్తుచేస్తుంది. ఈ రాశి వారికి 2025లో లవ్ కలిసిరాదు. కానీ.. జీవిత భాగస్వామి కోసం అన్వేషణ చేసే ముందు తమను తాము ఎలా మార్చుకుంటే ఎదుటి వ్యక్తికి నచ్చుతారో తెలుసుకుంటారు.

మకరం: ఒక రిలేషన్లో కమ్యూనికేషన్ అనేది ఎంత ముఖ్యమో ఈ రాశి వారికి 2025 తెలిసొచ్చేలా చేస్తుంది. సావధానంగా వినేంత ఓపికను, చెప్పేంత శక్తిని ఈ రాశి వారికి పరిచయం చేస్తుంది. మీకు పరిచయం అయ్యే వ్యక్తి వల్ల జీవితం పట్ల మీ ఆలోచనే పూర్తిగా మారిపోతుంది.

కుంభం: ప్రేమానుబంధాల్లో ఉండే భావోద్వేగం ఒక మనిషిపై ఎంతగా ప్రభావం చూపిస్తుందో కుంభ రాశి వారు 2025లో తెలుసుకుంటారు. జీవిత భాగస్వామితో సానుకూల పరిస్థితులను పెంపొందించుకుంటారు. ఆర్థిక పరిస్థితులపై, సేవింగ్స్పై, సెక్యూరిటీస్పై జీవిత భాగస్వామితో చర్చించి సరైన నిర్ణయాలు తీసుకుంటారు.

మీనం: 2025లో ఆత్మపరిశీలనతో పాటు అర్ధవంతమైన అనుబంధాలను పెంపొందించుకుంటారు. క్షణికమైన ఆకర్షణలకు లోను కాకుండా శాశ్వత సంతోషాన్ని పంచే జీవిత భాగస్వామిని పొందుతారు. జీవిత భాగస్వామి విషయంలో నిర్ణయం తీసుకునే సమయంలో శని గ్రహ ప్రభావం వల్ల ఒకటికి రెండు సార్లు ఆలోచించి, చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటారు.