Nature Day : ప్రకృతి కోసం ఒక రోజు కేటాయిద్దామా.. ఆనందంగా ఉందామా..!

సంవత్సరంలో ఎన్నో స్పెషల్ డేస్ ఉంటాయి. ప్రతి దాని వెనక ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. భూమి మీద నివసిస్తున్న అందరికీ ప్రకృతిని గుర్తుచేసే రోజు, 'ఆల్ ఈజ్ అవర్స్ డే".

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 8న ఆల్ ఈజ్ అవర్స్ డే గా జరుపుకుంటారు. ఇది ప్రకృతి, దాని సౌందర్యం, పర్యావరణం, వనరులు ఇదంతా మనదే అని గుర్తుకు తెచ్చుకునే రోజు, మనకు ప్రకృతి ఇస్తున్న వనరులకు ధన్యవాదాలు తెలుపుకునే రోజు. ఈ రోజుని ఉద్దేశించి "మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మన కోసమే ఉంది. మన బాధ్యత పూర్తిగా ప్రకృతే భరిస్తుంది. ఈ సందర్భంగా ప్రకృతి పట్ల మన బాధ్యత కూడా గుర్తు చేసుకోవాల్సిన రోజు ఇది " అంటారు పర్యావరణ శాస్త్రవేత్తలు.

పొద్దున్నే నిద్రలేపే సూర్యుడి నుంచి రాత్రి నిద్ర పుచ్చే చంద్రుడి వరకు రోజూ జీవితంలో భాగమయ్యే గాలి, నీరు, ఆకాశం భూమి, చెట్లు, పువ్వులు, పక్షులు, జంతువులు, నదులు, సముద్రాలు, వర్షం ఇలా అన్ని... ప్రకృతి కిందకే వస్తాయి.

ప్రకృతి చూసే విధా నాన్ని బట్టి ఒక్కోసారి అందంగా, ఒక్కోసారి విధ్వంసకారిణిగా కనిపి స్తుంది. కానీ వాస్తవానికి ప్రకృతి ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఒకేలా ప్రవర్తిస్తుంది. దానికి భిన్న ప్రవర్తనలు మానవుడే కల్పించాడు. ఈ 'ఆల్ ఈజ్ అవర్స్ డే' సందర్భంగా అమెరికాలో.. ప్రకృతిపట్ల మానవుడి భాద్యత గురించి చర్చించుకుంటారు.

ప్రకృతికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలుపు తారు. మానవాళి ప్రశాంతంగా జీవిం చాలంటే ప్రకృతి, పర్యావరణం సజావుగా ఉండాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు సముద్రాలు, నదులు, పర్వతాలు, అడవుల ఉనికికి ముప్పుగా పరిణమించాయి. భూతాపం పెరగడానికి, మంచు పర్వతాలు కరగడానికి కారణమవుతున్నాయి. ఓ శతాబ్దం తర్వాత ప్రకృతి రూపు చెదిరిపోయే ప్రమాదముంది. ప్రకృతి ఒడిలో మనుషులు హాయిగా ఉండాలంటే ప్రకృతిని అర్థం. చేసుకోవాలి. ప్రకృతిని గౌరవిస్తూ, దాని ఉనికిని కాపాడుతూ ఉండాలనేదే ఈ రోజు ముఖ్య ఉద్దేశం.